- Telugu News Photo Gallery Spiritual photos These four Zodiac signs will get immense money and fortune in coming new year 2023 know if yours is in it
కొత్త సంవత్సరంలో నాలుగు రాశుల వారికి ఆకస్మిక ధన లాభం.. మీ రాశికి ఎలా ఉందో చెక్ చేసుకోండి..
కొత్త సంవత్సరంలో ప్రధానంగా నాలుగు రాశుల వారికి ఆకస్మిక ధన లాభం అని చెప్పే అదృష్ట యోగం పట్టబోతోంది. ఇతర రాశుల వారికి కూడా కొద్దో గొప్పో అదృష్టం పట్టడానికి అవకాశం ఉంది. ఆకస్మిక ధన లాభం అనేది ఏ విధంగా అయినా వరించవచ్చు.
Updated on: Dec 19, 2022 | 8:18 PM

Horoscope

కొత్త సంవత్సరంలో ప్రధానంగా జనవరి 18న శనిగ్రహం కుంభరాశిలోకి, గురుగ్రహం ఏప్రిల్ 23న మేషరాశిలోకి, రాహు కేతువులు అక్టోబర్ 24న మీన, తులారాశిలోకి మారుతున్నారు. ఏప్రిల్ 23 తర్వాత మేషరాశిలో గురు రాహువులు కలవడం మేష, మిధున, తుల, ధను రాశుల వారికి ఎంతగానో యోగించి అదృష్టం పట్టించబోతున్నాయి. జాతక చక్రంలో దశలు, అంతర్దశలు సరిగ్గా లేని వరికి కూడా ఈ గ్రహ సంచారం వల్ల కొద్దో గొప్పో ఆదాయం పెరగటం ఖాయం.

మేషం ఈ రాశి వారికి జనవరి 18 తర్వాత భారీగా జీతం పెరగటం కానీ, భారీ జీతంతో కొత్త ఉద్యోగానికి ఆఫర్ రావడం కానీ జరుగుతుంది. ఆస్తుల విలువ అనూహ్యంగా పెరుగుతుంది. ఆర్థిక లావాదేవీలు ఏవైనా ఉంటే వాటి వల్ల ఎంతో ప్రయోజనం ఉంటుంది. ఇక రాదని వదిలేసుకున్న డబ్బు కూడా అనుకోకుండా చేతికి అందుతుంది. మొత్తానికి రెండు మూడు మార్గాల ద్వారా ధన లాభం కలిగే అవకాశం ఉంది.

వృషభం బ్యాంకుల్లో దాచుకున్న ఫిక్స్డ్ డిపాజిట్ లకు వడ్డీ శాతం పెరగటం వంటివి జరగవచ్చు. ముఖ్యంగా వడ్డీ వ్యాపారం చేసే వారికి బాగా కలిసి వస్తుంది. ఎల్ఐసి, చిట్స్ వంటి వ్యాపారాలు చేసే వారికి ఆర్థికంగా చాలా బాగుంది. ఉద్యోగంలో ఇంక్రిమెంట్లు పెరగటం లాంటివి చోటు చేసుకుంటాయి. ఏవైనా ఖరీదైన కానుకలు, బహుమతులు చేతికి అందే అవకాశం కూడా ఉంది.

మిథునం జనవరి 18 నుంచి అష్టమ శని నుంచి విముక్తి పొందటం, శని భాగ్య స్థానంలోకి మారటం, గురు రాహులు లాభ స్థానానికి రావడం వంటివి ఈ రాశి వారి జీవితాన్ని ఆర్థికంగా చక్కని మలుపు తిప్పబోతున్నాయి. వీటన్నిటినీ కలిపి మహా భాగ్య యోగంగా అభివర్ణించవచ్చు. జీవితంలో ఎన్నడూ ఊహించని అదృష్టం పడుతుందని ఖాయంగా చెప్పవచ్చు. అక్రమ సంపాదనతో సహా అనేక మార్గాల ద్వారా సంపద పెరగటం జరుగుతుంది.

కర్కాటకం వృత్తి వ్యాపార ఉద్యోగాల ద్వారా ఆదాయం పెరుగుతుంది. కోర్టు కేసు నెగ్గడం ద్వారా కూడా ఆస్తి సంక్రమించవచ్చు. భార్య తరఫు నుంచి ఆస్తి కలసి రావచ్చు. విదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న పిల్లల నుంచి కొద్దో గొప్పో ఆదాయం వచ్చే అవకాశం కూడా ఉంది. మొండి బకాయిలు వసూలు అయ్యే సూచనలు ఉన్నాయి. పొదుపు మొత్తాలు పెరగవచ్చు కూడా.

సింహం కొత్త సంవత్సరంలో ఈ రాశి వారికి ఆదాయం పెరగడానికి అవకాశం ఉంది. భాగ్య స్థానంలో గురువు రాహువులు కలవడం వల్ల తండ్రి వైపు నుంచి కొద్దిగా ఆస్తి కలిసి రావడం జరుగుతుంది. విదేశీ ధనం అనుభవించే సూచనలు కూడా ఉన్నాయి. స్పెక్యులేషన్, ఆర్థిక లావాదేవీల వల్ల ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి. అనవసర ఖర్చులు బాగా తగ్గించుకోవడం వల్ల బ్యాంకు నిలువ పెరిగే అవకాశం ఉంది.

కన్య ఈ రాశి వారికి జనవరి 18 నుంచి ఏప్రిల్ 23 వరకు ఆర్థికంగా చాలా బాగుంటుంది. కొన్ని ముఖ్యమైన ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. ఈ మూడు నెలల కాలంలో వృత్తి ఉద్యోగాల్లో సంపాదన కూడా బాగా పెరుగుతుంది. ఆస్తుల విలువ పెరుగుతుంది. ఇతరుల నుంచి రావలసిన బకాయిలు చేతికి అందుతాయి. డాక్టర్లు, లాయర్లు, ఐటీ నిపుణులు ఆశించిన దాని కంటే ఎక్కువగా ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. ఏప్రిల్ 23 తర్వాత ఆర్థికంగా స్తబ్ధత ఏర్పడుతుంది.

తుల చాలాకాలంగా వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఎదుగుదల లేకుండా జీవితం గడుపుతున్న ఈ రాశి వారిని కొత్త సంవత్సరం ఆర్థికంగా అందలం ఎక్కించబోతోంది. వివాహం ద్వారా, భార్య తరపు బంధువుల ద్వారా ఆస్తి కలిసి వచ్చే అవకాశం ఉంది. లాటరీ ద్వారా ఆకస్మిక ధనలాభానికి కూడా అవకాశం ఉంది. జూదాలు, షేర్లు, లంచాల వంటివి ఊహించని ఆదాయం తీసుకువచ్చే సూచనలు ఉన్నాయి.

వృశ్చికం కొత్త సంవత్సరంలో ఈ రాశి వారికి ఎక్కువగా ఉద్యోగ, వ్యాపారాల ద్వారానే ఆదాయం పెరిగే అవకాశం ఉంది. వడ్డీ వ్యాపారం ద్వారా కూడా బాగా కలిసి వస్తుంది. ఉద్యోగంలో అనుకోకుండా ఇంక్రిమెంట్లు వచ్చే అవకాశం ఉంది. అక్రమ సంపాదన కూడా ఉండవచ్చు. డాక్టర్లు, లిక్కర్ వ్యాపారులు, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారు ఇబ్బడి ముబ్బడిగా సంపాదించే సూచనలున్నాయి. అనవసర ఖర్చులకు కళ్లెం వేయడం ద్వారా కూడా ఆదాయం స్థిరంగా ఉండే అవకాశం ఉంది.

ధనుస్సు ధనయోగం, ఆకస్మిక ధనలాభం వంటి అంశాల్లో ఈ రాశి వారికి కొత్త సంవత్సరం అన్ని విధాలుగాను చాలా బాగుంది. ఊహించని విధంగా చిత్రవిచిత్ర మార్గాల్లో ఆదాయం బాగా పెరుగుతుంది. లాటరీ తగిలే అవకాశం ఉంది. ఏలినాటి శని నుంచి విముక్తి లభించడం వల్ల ఈ రాశి వారికి ఆర్థిక సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని చెప్పవచ్చు. ఎక్కడా కష్టపడకుండా, చెమటోడ్చకుండా సునాయాసంగా ఆర్థిక ప్రయోజనాలు సమకూరుతాయి.

మకరం జనవరి 18 నుంచి శని ఈ రాశి వారికి ధనస్థానంలో ప్రవేశించడం వల్ల అనేక ఆర్థిక ప్రయోజనాలు లభించనున్నాయి. ముఖ్యంగా కొన్ని ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభించే సూచనలు ఉన్నాయి. వివిధ మార్గాల ద్వారా ఆదాయం పెరిగే అవకాశం ఉంది. అదనపు ఆదాయానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. కొద్దిగా డబ్బు సంబంధమైన ఇబ్బందులు తొలగుతాయి.

కుంభం కొత్త సంవత్సరంలో ఈ రాశి వారికి ప్రయాణాల ద్వారా, తండ్రి ద్వారా, విదేశాల ద్వారా ఆదాయం పెరిగే సూచనలు ఉన్నాయి. మార్కెటింగ్, పంపిణీ వంటి వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారు విశేషంగా లబ్ధి పొందుతారు. ఈ ఏడాది కష్టేఫలి అనే సూత్రం ఈ రాశి వారికి బాగా వర్తిస్తుంది. అయితే, రుణ సమస్యల నుంచి, అనవసర ఖర్చుల నుంచి కొద్దిగా బయటపడటం ఈ రాశి వారికి చెప్పుకోదగ్గ విశేషం.

మీనం ఈ రాశి వారికి కొత్త సంవత్సరం నుంచి ఏలినాటి శని ప్రారంభం కాబోతోంది. రాసినాధుడైన గురువు ధనస్థానంలో ప్రవేశించడం, రాహువుతో కలవడం వల్ల అదనపు ఆదాయ ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. వృత్తి ఉద్యోగాల ద్వారా ఆదాయం పెరుగుతుంది. కుటుంబ సభ్యుల ద్వారా కూడా కొద్దో గొప్పో ఆదాయం కలిసి వస్తుంది. కోర్టు కేసులో విజయం సాధించడం వల్ల ఆస్తులు పెరుగుతాయి.



