
మేష రాశి : మకర సంక్రాంతి నుంచి మేషరాశి వారికి చాలా అద్భుతంగా ఉంటుంది. వీరు అనుకున్న పనులన్నీ సరైన సమయానికి పూర్తి చేస్తారు. ఆరోగ్యపరంగా, ఉద్యోగపరంగా, ఆర్థికంగా ఈ రాశి వారికి కలిసి వస్తుంది. పనుల్లో ఆటంకాలు తొలిగిపోతాయి. ఇంటా బయట సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వృత్తి పరంగా కలిసి వస్తుంది.

వృషభ రాశి : వృషభ రాశి వారికి సూర్యుడి సంచారం, ఉత్తరాయణం వైపు ప్రయాణం చేయడం అనేక ప్రయోజనాలను తీసుకొస్తుంది. వీరికి పట్టిందల్లా బంగారమే కానుంది. ఇంటా బయట సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. సూర్యుడు, వృషభ రాశి వారికి తొమ్మదో స్థానం నుంచి సంచారం చేయడం వలన నిరుద్యోగులు ఉద్యోగాన్ని పొందుతారు. నూతన అవకాశాలు ఏర్పడుతాయి. ఈ రాశి వారు ఈ సమయంలో చాలా ఆనందంగా గడుపుతారు.

మకర రాశి : మక రాశి వారికి చాలా అద్భుతంగా ఉండనుంది. వీరికి సంక్రాంతి పండుగ నుంచి లక్కు కలిసి వస్తుంది. వీరికి సూర్య సంచారం వలన కెరీర్ పరంగా బాగుంటగుంది. అంతే కాకుండా, ఆదాయం పెరుగుతుంది. అలాగే నిరుద్యోగుల ఉద్యోగాన్ని పొందుతారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. రియలెస్టేట్ రంగంలో ఉన్నవారు అత్యధిక లాభాలు అందుకుంటారు. ఇంటా బయట సంతోషకర వాతావరణం ఏర్పడుతుంది.

కుంభ రాశి : కుంభ రాశి వారికి సంక్రాంతి తర్వాత అద్భుతంగా ఉంటుంది. ఈ రాశి వారికి పనుల్లో ఆటంకాలు తొలిగిపోతాయి. మకర సంక్రాంతికి సూర్యుడు కుంభరాశి వారికి 12వ స్థానం నుంచి సంచారం చేయనున్నాడు. దీని వలన ఈ రాశి వారు ఎవరు అయితే విదేశీ ప్రయాణాలు చేయాలి అనుకుంటారో వారి కోరిక నెరవేరుతుంది. ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఆదాయం పెరుగుతుంది. ఖర్చులు తగ్గడం, ఆదాయం పెరగడంతో ఈ పండుగ నుంచి వీరు చాలా ఆనందంగా గడుపుతారు.

వృశ్చిక రాశి : వృశ్చిక రాశి వారికి సంక్రాంతి పండగు నుంచి అద్భుతమైన ప్రయోజనాలు చేకూరనున్నాయి. వీరికి పట్టిందల్లా బంగారమే అవుతుంది. అప్పులు తీరిపోయి, చాలా ఆనందంగా ఉంటారు. సమాజంలో పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయి. అలాగే సూర్యుడు వృశ్చిక రాశి వారికి మూడవ స్థానం నుంచి సంచారం చేయడం వలన వీరికి కార్యాలయాల్లో పనికి తగిన గుర్తింపు లభిస్తుంది. ఉన్నతాధికారుల నుంచి మన్ననలు పొందుతారు.