ఈ నెల 17 నుంచి నవంబర్ 16 వరకూ రవి తులా రాశిలో నీచత్వం పొందడం జరుగుతోంది. గ్రహ రాజైన రవి నీచబడడం కొన్ని రాశులకు ఏమంత మంచిది కాదు. తండ్రి, అధికారం, ప్రభుత్వం, ఆరోగ్యం, సంపదలకు కారకుడైన రవి ఏ విధంగా బలహీనపడినా ఈ కారకత్వాలకు సంబంధించి సమస్యలు సృష్టించడం జరుగుతుంది. మేషం, కర్కాటకం, కన్య, వృశ్చికం, కుంభం, మీన రాశుల వారు రవి నీచబడడం వల్ల కొద్దిగా ఇబ్బందులు పడే అవకాశం ఉంది. ఈ రాశుల వారు ఓ నెల రోజుల పాటు రోజూ ఉదయం ఆదిత్య హృదయం లేదా సుందరకాండ పఠించడం వల్ల రవి దోషాలు తగ్గే అవకాశం ఉంటుంది.