- Telugu News Photo Gallery Spiritual photos Shukra Guru Yuti in Meena Rashi: These zodiac signs to become lucky details in telugu
Lucky Zodiac Signs: ఈ రాశుల వారు నక్క తోక తొక్కినట్టే.. ఆకస్మిక ధనలాభం పక్కా..!
ఈ నెలాఖరులో మీన రాశిలో శుక్ర, గురువుల కలయిక వల్ల కొన్ని రాశుల వారికి అప్రయత్న ధన లాభం, ఆకస్మిక ధన లాభం వంటివి కలగబోతున్నాయి. ఈ రాశిలో శుక్రుడు ఉచ్ఛ పట్టడం వల్ల ఆదాయ వృద్ధిని సూచిస్తాడు. ఇక్కడ రాహువు ఉండడం వల్ల ఆకస్మిక పరిణామాలు చోటు చేసుకుంటాయి. శుక్ర, రాహువులు గురు శిష్యులైనందువల్ల చిన్న ప్రయత్నమైనా నక్కతోక తొక తొక్కినట్టు అత్యధిక లాభాలు కలిగే అవకాశం ఉంటుంది. ఈ రెండు గ్రహాల కలయిక ఫిబ్రవరి నెలాఖరు వరకూ కొనసాగుతుంది. వృషభం, మిథునం, కర్కాటకం, కన్య, తుల, కుంభ రాశుల వారు అత్యధికంగా ఆర్థిక లాభాలు పొందుతారు.
Updated on: Jan 22, 2025 | 3:56 PM

వృషభం: రాశ్యధిపతి శుక్రుడు లాభ స్థానంలో ఉచ్ఛస్థితికి రావడం వల్ల, పైగా రాహువుతో యుతి చెందడం వల్ల సాధారణంగా షేర్లు, స్పెక్యులేషన్లలో అత్యధిక లాభాలు గడించే అవకాశం ఉంది. కొద్దిపాటి ప్రయత్నంతో అత్యధికంగా ఆర్థిక లాభాలు గడించే అవకాశం కూడా ఉంది. వృత్తి, వ్యాపారాల్లో అనుకోని విధంగా యాక్టివిటీ పెరుగుతుంది. తీరిక లేని పరిస్థితి ఏర్పడుతుంది. ఉద్యోగంలో ఊహించని విధంగా వేతనాలు పెరుగుతాయి. ఆర్థికంగా ఒక మంచి స్థాయికి చేరుకునే అవకాశం ఉంది.

మిథునం: ఈ రాశివారికి దశమ స్థానంలో శుక్ర, రాహువుల సంచారం వల్ల ఉద్యోగులు కూడా వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టి లాభాలు పొందే అవకాశం ఉంటుంది. స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టడం వల్ల అత్యధికంగా లాభాలు అందుకుంటారు. జీవితంలో కలలో కూడా ఊహించని ఆర్థికాభివృద్ధి కలుగుతుంది. విదేశీ సంపాదన అనుభవించే యోగం కూడా పడుతుంది. వృత్తి, వ్యాపారాల్లో పెట్టు బడులకు మించిన లాభాలు కలుగుతాయి. ఉద్యోగంలో అంచనాలకు మించి జీతాలు పెరుగుతాయి.

కర్కాటకం: భాగ్య స్థానంలో శుక్ర రాహువుల కలయిక ఈ రాశుల వారికి అనేక అదృష్టాలను తెచ్చి పెడు తుంది. తల్లితండ్రుల నుంచి వారసత్వ సంపద లభిస్తుంది. నిరుద్యోగులకే కాక, ఉద్యోగులకు కూడా విదేశాల నుంచి ఆఫర్లు అందే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో బాగా రాణించడం, గుర్తింపు పొందడం జరుగుతుంది. ఆర్థికంగా ఉన్నత స్థానానికి చేరుకుంటారు. దాంపత్య జీవితంలో ప్రేమా నురాగాలు బాగా పెరుగుతాయి. అనేక మార్గాల్లో ఆదాయం దిన దినాభివృద్ధి చెందే అవకాశం ఉంది.

కన్య: ఈ రాశివారికి అనేక విధాలుగా ధన లాభాలు కలుగుతాయి. ఆకస్మిక ధన ప్రాప్తికి, అప్రయత్న ధన లాభానికి కూడా అవకాశం ఉంది. దాదాపు పట్టిందల్లా బంగారం అవుతుంది. రావలసిన సొమ్ము చేతికి అందుతుంది. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారమై, విలువైన ఆస్తి లభి స్తుంది. ముఖ్యంగా ఈ రాశివారు షేర్లలో పెట్టుబడులు పెట్టడం వల్ల అపారమైన ధన లాభాలు పొందుతారు. వృత్తి, వ్యాపారాల్లో సమస్యలన్నీ తొలగిపోయి, లాభాలు మాత్రమే కలిగే అవకాశం ఉంది.

తుల: ఈ రాశివారికి ఆరవ స్థానంలో రాశ్యధిపతి శుక్రుడితో రాహువు కలవడం వల్ల స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టడం వల్ల అత్యధికంగా లాభాలు పొందుతారు. వృత్తి, వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కుతాయి. ఆర్థిక సమస్యల నుంచి, వ్యక్తిగత సమస్యల నుంచి పూర్తిగా విముక్తి లభించి మాన సిక ప్రశాంతతను అనుభవిస్తారు. వారసత్వ సంపద లభిస్తుంది. ఆస్తిపాస్తులు వృద్ధి చెందుతాయి. సొంత ఇంటి కల నెరవేరే అవకాశం ఉంది. ఆరోగ్య లాభం కలుగుతుంది. ఆదాయం వృద్ధి చెందుతుంది.

కుంభం: ఈ రాశికి ధన స్థానంలో శుక్ర, రాహువుల కలయిక చోటు చేసుకుంటున్నందువల్ల తప్పకుండా అనేక విధాలుగా ఆధాయం వృద్ధి చెందుతుంది. అదనపు ఆదాయ మార్గాలు విస్తరించే అవకాశం ఉంది. ఆకస్మిక ధన ప్రాప్తికి బాగా అవకాశం ఉంది. రావలసిన సొమ్ము, రాదనుకుని వదిలేసు కున్న డబ్బు, బాకీలు, బకాయిలన్నీ వసూలవుతాయి. షేర్ల వల్ల బాగా లాభాలు కలుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు అంచనాల్ని మించుతాయి. ఉద్యోగంలో భారీగా వేతనాలు పెరుగుతాయి.



