AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆషాఢ మాసంలో బంగారం వెండి కొనుగోలు చేయోచ్చా?

ఆషాఢ మాసం వచ్చేస్తుంది. ఈ మాసంలో బంగారం ధరలు చాలా తగ్గుతాయి. అయితే కొంత మంది ఈ సమయంలో బంగారం కొనుగోలు చేస్తే, మరికొంత మంది గోల్డ్ కొనుగోలు చేయడానికి అంతగా ఆసక్తి చూపరు. కాగా, ఇప్పుడు మనం అసలు ఆషాఢ మాసంలో బంగారం కొనుగోలు చేయవచ్చునా? లేదా అనేది వివరంగా తెలుసుకుందాం.

Samatha J
|

Updated on: Jul 17, 2026 | 4:44 PM

Share
అయితే ఆషాఢ మాసంలో బంగారం కొనుగోలు చేయడం చేయకపోవడం అనేది రెండు అంశాలపై ఆధారపడి ఉంటుందని చెబుతున్నారు నిపుణులు. ఆధ్యాత్మికంగా చూస్తే ఈ మాసంలో కొంత మంది బంగారం కొనుగోలు చేయడానికి అంతగా ఆసక్తి చూపరు. కానీ వ్యాపార పరంగా చూస్తే ఈ సమయంలో బంగారం కొనుగోలు చేయడం చాలా లాభదాయకంగా ఉంటుందంట.

1 / 5
ఆధ్యాత్మికంగా చూస్తే, ఆషాఢ మాసాన్ని శూన్య మాసం అంటారు. ఈ సమయంలో ఎలాంటి శుభకార్యాలు జరపరు. ముఖ్యంగా శుభకార్యాలు, గృహ ప్రవేశాలు చేయరు. అంతే కాకుండా బంగారం, బంగారు నగలు  కొనుగోలు చేయడం. అంతే కాకుండా కొత్త వ్యాపారాలు మొదలు పెట్టరు. ఆషాఢంతో దక్షిణాయనం మొదలవుతుంది కాబట్టి, దేవతలు నిద్రలోకి వెళ్లిపోతారు. అందుకే ఈ మాసంలో శుభకార్యాలు జరపరు.

2 / 5
అంతే కాకుండా ఆషాఢంలో బంగారం కొనుగోలు చేసి ఆడపిల్లకు పెట్టడం వలన అత్తింటిలో కష్టాలు, నష్టాలు వస్తాయని కొంత మంది, కొన్ని ప్రాంతాల్లో అంటుంటారు. అందుకే చాలా వరకు ఆషాఢ మాసంలో బంగారం  కొనుగోలు చేయకూడదు అంటారు. కానీ పెట్టుబడి కోణంలో, వ్యాపార పరంగా చూస్తే, ఈ సమయంలో బంగారం కొనుగోలు చేయడం చాలా మంచిది అంటారు.

3 / 5
ఎందుకంటే, ఈ సమయంలో బంగారం ధర చాలా తగ్గుతుంది. అంతే కాకుండా చాలా బంగారం షాపు యజమానులు ఆఫర్స్ కూడా పెడుతారు. ఇక శ్రావణ మాసంలో శుభకార్యాలు ఎక్కువగా ఉండటంతో చాలా మంది బంగారం కొనుగోలు చేస్తుంటారు. ధరలు కూడా విపరీతంగా పెరుగుతాయి. అయితే వ్యాపార పరంగా, పెట్టుబడి పరంగా చూస్తే ఆషాఢ మాసంలో బంగారం కొనుగోలు చేయడమే మంచిది. అయితే ఆధ్యాత్మికంగా నమ్మకాలు ఎక్కువగా ఉన్నవారు, కొనుగోలు చేయకపోవడమే మంచిదంట.

4 / 5
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

5 / 5
Follow Us