హోలీ రోజే చంద్రగ్రహణం.. భారతదేశంపై దీని ప్రభావం ఎలా ఉంటుందంటే?
హిందూ పురాణాల ప్రకారం గ్రహణానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. మరీ ముఖ్యంగా చంద్ర గ్రహణానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఇది భూమి, చంద్రుడు, సూర్యుడు ఒకే సరళ రేఖలోకి వచ్చినప్పుడు సూర్యకాంతి భూమి మీద పడుతుంది కాని చంద్రునిపై పడదు. దీంతో చంద్ర గ్రహణం ఏర్పడుతుంది అంటారు. ఇక పౌర్ణమి రోజు చంద్ర గ్రహణం ఏర్పడితే, అమావాస్య రోజు సూర్యగ్రహణం ఏర్పడుతుంది. అయితే ఈ సారి 2025లో తొలిసారి మార్చి14న హోలీ పండుగ రోజే సంపూర్ణ చంద్ర గ్రహణం ఏర్పడుతుంది.
Updated on: Mar 01, 2025 | 10:59 AM

మన భారత దేశ సమయం ప్రకారం ఈ చంద్రగ్రహణం అనేది ఉదయం 9 గంటల 27 నిమిషాలకు ప్రారంభమై, ఉదయం 11 గంటల 56 నిమిషాలకు సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుంది.

అయితే చాలా మందిలో హోలీ పండుగ రోజే చంద్రగ్రహణం ఏర్పడుతుంది. దీని ప్రభావం ఎలా ఉండబోతుంది. ఫెస్టివల్ జరుపుకోవడంపై ఏమైనా ఆంక్షలు ఉంటాయా? అని ఆలోచిస్తుంటారు. వారికోసమే ఈ సమాచారం.. అయితే భారత దేశంపై ఈ చంద్రగ్రహణ ప్రభావం ఉండదంటున్నారు పండితులు.

ఎందుకంటే గ్రహణం సమయంలో ఇక్కడ పగలు ఉంటుంది కాబట్టి, దీని ప్రభావం భారతదేశంపై ఏమాత్రం ఉండదంట. ఇది ఎక్కువగా ఉత్తర అమెరికా, పశ్చిమ ఆఫ్రికాలో కనిపిస్తుందంట.

అందువలన ఎలాంటి ఇబ్బందులు లేకుండా మార్చి 13న హోలికా దహనం, మార్చి 14న హోలీ పండుగను జరుపుకోవచ్చు అంట.

అంతే కాకుండా గ్రహణం ప్రభావం మన దేశంపై ఉండకపోవడం వలన మేషం నుంచి మీన రాశి వరకు ఏ రాశి వారిపై ఎలాంటి ప్రభావం ఉండని కొందరు పండితులు చెబుతున్నారు.