AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రతికూలంగా కేతువు.. ఈ రాశులకు కష్టనష్టాలు..! పరిహారాలు ఇవీ..

Ketu's Negative Influence: జ్యోతిషశాస్త్రం ప్రకారం కేతువు పరమ పాప గ్రహం. విష నాగుకు రాహువు తల అయితే, కేతువు తోక. కేతువు ఒక మిస్టరీ గ్రహం. ఎప్పుడు ఏ విధంగా సమస్యలు సృష్టిస్తాడన్నది ఊహించడం కష్టం. కేతువు ప్రతికూలంగా ఉన్నప్పుడు జాతకుడిని తప్పకుండా కన్నీరు పెట్టిస్తాడని, ఊరికే వదిలిపెట్టడని జ్యోతిషశాస్త్రం చెబుతోంది. ప్రస్తుతం సింహ రాశిలో 2026 డిసెంబర్ వరకు సంచారం చేస్తున్న కేతువు వృషభం, సింహం, కన్య, వృశ్చికం, మకరం, కుంభ రాశులను తప్పకుండా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ఈ రాశుల వారు సుబ్రహ్మణ్యాష్టకాన్ని, విష్ణు సహస్ర నామ స్తోత్రాన్ని ప్రతి రోజూ తప్పకుండా పఠించడంతో పాటు, కేతువుకు ప్రత్యేకంగా పూజ చేయించడం మంచిది.

TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Aug 20, 2025 | 4:42 PM

Share
వృషభం: ఈ రాశికి నాలుగవ స్థానంలో కేతువు సంచారం వల్ల ఈ రాశివారికి సుఖ నాశనం కలుగుతుంది. కుటుంబంలో సమస్యలు తలెత్తుతాయి. విభేదాలు, వివాదాలు, అపార్థాలు విజృంభిస్తాయి. దాంపత్య జీవితంలో సుఖ సంతోషాలు తగ్గుతాయి. శుభకార్యాలకు ఆటంకాలు ఏర్పడతాయి. గృహ, వాహన ప్రయత్నాలు ముందుకు సాగవు. ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ఆస్తి సమస్యలు ఇబ్బంది పెడతాయి. ఈ రాశివారు కేతువుకు ఆలయాల్లో పరిహారం చేయించడం మంచిది.

1 / 6
సింహం: ఈ రాశిలో కేతువు సంచారం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. రోగ నిర్ధారణకు అందని అనారోగ్యాలు కలగడానికి అవకాశం ఉంది. బంధువుల నుంచి నిందలు, విమర్శలు రావడం జరుగు తుంది. ఉద్యోగంలో ప్రాభవం తగ్గుతుంది. వృత్తి, వ్యాపారాలు మందగిస్తాయి. జీవిత భాగస్వామితో సమస్యలు తలెత్తుతాయి. ప్రయాణాల్లో ఇబ్బందులు పడతారు. పెళ్లి ప్రయత్నాల్లో ఆశాభంగాలు, నిరాశా నిస్పృహలు ఎదురవుతాయి. ఈ రాశివారు రోజూ సుబ్రహ్మణ్యాష్టకం పఠించడం మంచిది.

2 / 6
కన్య: ఈ రాశివారికి వ్యయ స్థానంలో కేతువు సంచారం వల్ల రహస్య శత్రువులు తయారవుతారు. నర ఘోష ఎక్కువగా ఉంటుంది. మిత్రుల్ని కూడా నమ్మలేని పరిస్థితి ఏర్పడుతుంది. ధన వ్యయం, ధన నష్టం ఎక్కువగా ఉంటాయి. ఆర్థిక వ్యవహారాలు, ఆర్థిక లావాదేవీల్లో ఇబ్బందులు పడడం జరుగుతుంది. ప్రయోజనం లేని ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి. కష్టార్జితంలో ఎక్కువ భాగం వృథా అవుతుంది. ఈ రాశివారు కేతువుకు తరచూ పూజ చేయించడం, స్కంద స్తోత్రం పఠించడం మంచిది.

3 / 6
వృశ్చికం: ఈ రాశికి దశమ స్థానంలో కేతువు సంచారం వల్ల ఉద్యోగ జీవితంలో వేధింపులు, సహాయ నిరాకరణ, విమర్శలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అనేక పర్యాయాలు ఉద్యోగం మారడానికి అవకాశం ఉంది. పదోన్నతులు, జీతభత్యాల పెరుగుదల నిలిచిపోతాయి. వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ తగ్గుతుంది. ఉద్యోగంలో పొరపాట్లు జరిగే అవకాశం కూడా ఉంది. ఆర్థిక వ్యవహారాల్లో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ఈ రాశివారు కేతువుకు ప్రత్యేక పరిహారం చేయించడం అవసరం.

4 / 6
మకరం: ఈ రాశికి అష్టమ స్థానంలో కేతువు ప్రవేశం వల్ల జీవిత భాగస్వామి తరచూ అనారోగ్యాలకు గురవడం జరుగుతుంది. తేలికగా మోసపోవడం, తరచూ ధన నష్టం జరగడం, అధికారులు అన్యాయం చేయడం, ఆస్తి సమస్యలు పెరగడం వంటివి జరుగుతాయి. ఆర్థిక సంబంధమైన ఒత్తిడి ఉంటుంది. ఆర్థిక లావాదేవీలకు, మదుపులు, పెట్టుబడులకు, వాగ్దానాలకు, ఉచిత సహాయాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఈ రాశివారు స్కంద సోత్రాన్ని ఎక్కువసార్లు పఠించడం మంచిది.

5 / 6
కుంభం: ఈ రాశికి సప్తమ స్థానంలో కేతువు సంచారం వల్ల జీవిత భాగస్వామితో ఎడబాటు కలిగే అవకాశం ఉంది. జీవిత భాగస్వామి అనారోగ్యానికి గురి కావడం, దూర ప్రాంతానికి బదిలీ కావడం, విభేదాలు తలెత్తడం వంటివి జరగవచ్చు. పెళ్లి ప్రయత్నాల్లో ఆశాభంగాలు తప్పకపోవచ్చు. ప్రేమ వ్యవహారాల్లో కూడా అపార్థాలు తలెత్తుతాయి. నష్టదాయక వ్యవహారాలు ఎక్కువగా ఉంటాయి. పిల్లలతో సమస్యలుంటాయి. ఈ రాశివారు ప్రతి రోజూ సుబ్రహ్మణ్యాష్టకం పఠించడం వల్ల లాభం ఉంటుంది.

6 / 6
Follow Us
ఆ ఒక్క హీరోతో వరుసగా మూడు సినిమాలు.. అది అంత మంచిది కాదు..

గాల్లో ఉండగా బ్రిటిష్ ఎయిర్‌వేస్ విమానంలో హైఅలర్ట్.. ఏంజరిగిందంటే

ఫాస్టెస్ట్ సెంచరీ చేస్తా.. వైభవ్ టార్గెట్లు మామూలుగా లేవు

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో బుల్లెట్ కలకలం.. ప్రయాణికుడు అదుపులోకి..

నాన్నమ్మ కమ్మలపై కన్నేసిన మనవడు.. వాటి కోసం ఏం చేశాడో తెలిస్తే..

భారత్, విండీస్ తొలి టీ20.. ప్లేయింగ్ ఎలెవన్‌లో 4 భారీ మార్పులు

గోల్డెన్ ఛాన్స్ మిస్సైన రుక్మిణి వసంత్..

ChatGPT Plus అదిరిపోయే ఆఫర్.. నెల రోజుల పాటు ఫ్రీ ట్రయల్!

మధుమిత ఎంతకు తెగించింది భయ్యా.. కారెక్కి ఏం చేసిందో తెలుసా..?

ATM ధ్వంసం చేసి రూ.30లక్షలు కాజేసిన కేటుగాళ్లు