
కస్టమైజ్డ్ కీచైన్ లేదా నేమ్ పెండెంట్: మీ బంధాన్ని గుర్తుచేసే కస్టమైజ్డ్ కీచైన్ లేదా నేమ్ పెండెంట్ మీ సోదరికి బహమతిగా ఇవ్వొచ్చు. ఇది ఆమెకు ఎంతగానో నచ్చుతుంది. మీరు వీటిని మార్కెట్లో రూ. 150 నుంచి రూ. 300కే కొనవచ్చు. అయితే ముందుగానే బుక్ చెయ్యాల్సి ఉంటుంది. బుక్ చేసిన ఒకటి, రెండు రోజుల్లో మీకు లభిస్తుంది.

ఆభరణాలు: రాశిచక్ర హారాలు, చక్ర బ్రాస్లెట్లు లేదా సానుకూలత, రక్షణను సూచించే ఆధ్యాత్మిక పెండెంట్లు వంటి స్టైలిష్ ఆభరణాలను బహుమతిగా ఇవ్వడాన్ని పరిగణించండి. ఇవి మీ సోదరికి రక్షణగా నిలిస్తాయి. మీ సోదరి ఎప్పుడు సంతోషంగా ఉంటుంది.

మినీ మేకప్ కిట్: మీ సోదరి మేకప్ వేసుకోవడం ఇష్టం ఉంటె మాత్రం లిప్ బామ్, ఐలైనర్. కాంపాక్ట్ వంటి ముఖ్యమైన వస్తువులతో కూడిన మినీ మేకప్ సెట్ రాఖి గిఫ్ట్ కోసం మంచి ఎంపికనే చెప్పాలి. ఇది సోదరి కళ్ళలో సంతోషాన్ని నింపుతుంది. దీని ధర రూ. 300 నుంచి రూ. 500 మధ్య ఉంటుంది.

ప్రింటెడ్ కాఫీ మగ్: “బెస్ట్ సిస్టర్ ఎవర్” లేదా “మై రాఖీ రాక్‌స్టార్” వంటి కోట్‌తో కూడిన కాఫీ మగ్ బోహామతిగా ఇస్తే ఆమెకు ఉపయోగకరంగా ఉంటుంది. ఇది మీ సోదరికి నచ్చుతుంది కూడా. ఇవి అన్నిచోట్ల చాల సులభంగా రూ. 199 నుంచి రూ.349 మధ్యలోనే దొరికేస్తుంది.

సాఫ్ట్ టాయ్స్ లేదా కుషన్లు: అందమైన టెడ్డీ బేర్స్ లేదా హృదయ ఆకారపు కుషన్లు చెల్లెళ్లకు సరైనవి. వీటి ధర రూ. 200 నుంచి రూ.500 కు ఉంటుంది. కావాలంటే ఇంకా ఎక్కువ ధరలో కూడా ఉంటాయి. ఇది బహుమతి మీ సోదరికి ఎంతగానో నచ్చుతుంది.