Education Astrology: గురు, బుధుల అనుకూలత.. చదువుల్లో ఈ రాశులవారికి తిరుగే లేదు..!

Edited By: Janardhan Veluru

Updated on: Aug 09, 2025 | 7:10 PM

జ్యోతిషశాస్త్రం ప్రకారం చదువులకు గురు, బుధులు కారకులు. ఇందులో బుధుడు సామాన్య విద్యను, గురువు ఉన్నత విద్యను అనుగ్రహిస్తారు. ఈ రెండు గ్రహాలు అనుకూలంగా ఉన్న పక్షంలో ఏ రాశివారైనా చదువుల్లో బాగా రాణించడం, గుర్తింపు పొందడం, ఘన విజయాలు సాధించడం జరుగుతుంది. ఈ ఏడాదంతా గురువు బుధుడికి చెందిన మిథున రాశిలో సంచారం చేస్తున్నందువల్ల సైన్స్, మేథ్స్, టెక్నాలజీ, కమ్యూనికేషన్స్, క్రీడలు వంటి రంగాలకు చెందిన విద్యార్థులు బాగా రాణిస్తారు. మిథునం, కన్య, తుల, ధనుస్సు, మకరం, మీన రాశులకు చెందిన జాతకులకు మిథున రాశిలోని గురువు, కర్కాటక రాశిలోని బుధుడు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల ఈ రంగాల్లో దూసుకుపోయే అవకాశం ఉంది.

1 / 6
మిథునం: ఈ రాశిలో గురువు, విద్యా స్థానమైన ద్వితీయ స్థానంలో రాశ్యధిపతి బుధుడు సంచారం చేస్తు న్నందు వల్ల టెక్నాలజీ రంగానికి చెందిన విద్యార్థులు ఈ రంగంలో రికార్డులు సృష్టించే అవకాశం ఉంది. ఈ రాశివారు ఏకకాలంలో రెండు విభిన్న సబ్జెక్టులను అధ్యయనం చేయగల సామర్థ్యం కలిగి ఉంటారు. ఆధునిక విద్యలు, నైపుణ్యాలను నేర్చుకోవడంలో ఈ రాశివారు ముందుంటారు. వృత్తి జీవితంలో ఉన్నవారు, ఉద్యోగులు ఆధునిక నైపుణ్యాల్లో శిక్షణ పొందే అవకాశం ఉంది.

2 / 6
కన్య: ఈ రాశికి అధిపతి బుధుడు విద్యాకారకుడు కావడం, విద్యాస్థానాన్ని గురు, శుక్రులు వీక్షించడం వల్ల ఈ రాశివారు విద్యారంగంలో బాగా రాణించే అవకాశం ఉంది. సైన్స్, వైద్యం, న్యాయశాస్త్రం, పరిశోధనలు, ఇన్నొవేషన్స్ లలో వీరు ఈ ఏడాది పేరు ప్రఖ్యాతులు సంపాదించే అవకాశం ఉంది. సాధారణంగా ఈ రాశివారు ఏక సంథాగ్రాహులైనందువల్ల ఈ విషయాన్నయినా తేలికగా పురోగతి సాధించడం జరుగుతుంది. వీరు ఉన్నత విద్యలు, పరిశోధనల కోసం విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది.

3 / 6
తుల: ఈ రాశివారికి గురు, బుధులిద్దరూ ఈ ఏడాదంతా బాగా అనుకూలంగా ఉండడం జరుగుతోంది. ఫలితంగా వీరు ఉన్నత విద్యలు, పరిశోధనలకు విదేశాలకు వెళ్లడం కూడా జరుగుతుంది. ఆధునిక సబ్జెక్టుల్లో వీరు అతి తేలికగా రాణిస్తారు. అనేక నైపుణ్యాలను వంటబట్టించుకుంటారు. సాధారణంగా టెక్నాలజీ, సైన్స్, మెడిసిన్ వంటి రంగాల్లో ఉన్నత స్థానాలకు వెళ్లడం జరుగుతుంది. ఉద్యోగులు తమ ప్రతిభను, నైపుణ్యాలను మెరుగుపరచుకుంటారు. కళారంగంలో కూడా రాణిస్తారు.

4 / 6
ధనుస్సు: ఈ రాశికి అధిపతి గురువు అయినందువల్ల, ప్రస్తుతం ఆ గురువు ఈ రాశిని వీక్షిస్తున్నందువల్ల ఈ రాశికి చెందిన ప్రతి విద్యార్థి సాటి లేని మేటి అనిపించుకుంటారు. ఉన్నత స్థాయి చదువులు, పరిశోధనల కోసం వీరు త్వరలో విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. ఈ రాశికి చెందిన వృత్తి, ఉద్యోగాల వారు కూడా ఉన్నత విద్యలను అభ్యసించే అవకాశం ఉంది. మిథున రాశిలో ఉన్న గురువు కారణంగా ఈ రాశికి చెందిన విద్యార్థులు తక్కువ శ్రమతో ఉత్తమ ఫలితాలు సాధిస్తారు.

5 / 6
మకరం: ఈ రాశికి అధిపతి అయిన శని అయినందువల్ల ఈ రాశివారికి ఏ విషయాన్నయినా లోతుగా అధ్యయనం చేయడం మీద మక్కువ ఉంటుంది. సైన్స్, మేథ్స్, ఫిజిక్స్, కమ్యూనికేషన్స్, ఇంజనీ రింగ్ వంటి రంగాల్లో విశేషంగా రాణిస్తారు. ఉన్నత విద్యల కోసం, ఆధునిక పరిశోధనల కోసం విదే శాలకు వెళ్లే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ రాశివారికి సప్తమంలో బుధాదిత్య యోగం ఏర్పడినందువల్ల విద్యార్థుల్లో చదువుల పట్ల, ఉన్నత విద్యల పట్ల శ్రద్ధాసక్తులు బాగా పెరిగే అవకాశం ఉంది.

6 / 6
మీనం: ప్రస్తుతం రాశ్యధిపతి గురువు చతుర్థ స్థానంలోనూ, బుధుడు పంచమ స్థానంలోనూ సంచారం చేస్తున్నందువల్ల ఈ రాశికి చెందిన విద్యార్థులు చదువులు, పోటీ పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించే అవకాశం ఉంది. ఉన్నత విద్యల కోసం విదేశాలకు వెళ్లడం జరుగుతుంది. ఈ రాశి ఉద్యో గులు, డాక్టర్లు, టెక్నాలజీ రంగానికి చెందినవారు ఆధునిక నైపుణ్యాల్లో శిక్షణ పొందే అవకాశం ఉంది. ఆధ్యాత్మిక సంబంధమైన అంశాలు, మనస్తత్వ శాస్త్రం వంటి విషయాల్లో కూడా వీరు రాణిస్తారు.