- Telugu News Photo Gallery Spiritual photos Dhanteras 2022 these famous temple dedicated to lord dhanvantari must visit on dhanteras
Dhanteras 2022: ధన్‌తేరస్ రోజున సంపదని, ఆరోగ్యాన్ని ఇచ్చే ఈ ఆలయాలను సందర్శించండి..
ధన్వంతరి జయంతిని ధన్‌తేరస్ రోజును జరుపుకుంటారు. దేవతల వైద్యుడైన ధన్వంతరి స్వామిని దర్శించుకోవడం వలన సుఖ సంపదలు, ఆరోగ్యం సిద్ధిస్తుందని భక్తుల విశ్వాసం. ఈ నెల 23 వ తేదీ ధన్ తేరాస్ సందర్భంగా మన దేశంలో ఏయే ఆలయాలను సందర్శించవచ్చో తెలుసుకుందాం.
Updated on: Oct 17, 2022 | 1:23 PM

దేవ వైద్యుడు ధన్వంతరిని ధన్‌తేరస్ రోజున పూజిస్తారు. అతను విష్ణువు అవతారంగా, ఆయుర్వేద ఔషధలకు అధినాయకుడుగా గా కూడా పరిగణించబడుతున్నాడు. ధన్వంతరి జన్మదినాన్ని ధన్‌తేరస్‌గా జరుపుకుంటారు. ధన్వంతరి మహాసముద్రం నుండి ధన్‌తేరస్ రోజున అమృత పాత్రను తీసుకుని వచ్చాడని పురాణాల కథనం. ధన్‌తేరస్ రోజున మీరు ధన్వంతరి ఆలయానికి వెళ్లవచ్చు. ఏయే ఆలయాలకు దర్శనానికి వెళ్లవచ్చో తెలుసుకుందాం.

రంగనాథస్వామి ఆలయం - మీరు తమిళనాడులో ఉన్న రంగనాథస్వామి ఆలయాన్ని సందర్శించవచ్చు.శ్రీరంగ పట్టణంలో కొలువై ఉన్న శ్రీరంగనాధుని ఆలయంలోని ధన్వంతరి మందిరంలో నిత్యపూజలు నిర్వహిస్తారు. అప్పటి గొప్ప ఆయుర్వేద వైద్యుడు గరుడవాహన భట్టార్ ఈ మందిరంలో మూర్తిని ప్రతిష్ఠించినట్లు తెలుస్తున్నది. ఈ ఆలయంలో మూలికలను తీర్ధంగా మూలికల రసాన్ని (కషాయం) ఇస్తారు. వద్దనున్న శిలాఫలకం ప్రకారం అది 12వ శతాబ్దానికి చెందినదిగా తెలుస్తోంది.

శ్రీ ధన్వంతరి ఆలయం - తమిళనాడులోని ధన్వంతరి భగవంతుని మరొక ప్రసిద్ధ ఆలయం. ఇది కోయంబత్తూరులో ఉంది. ధన్వంతరి స్వామిని ప్రధానంగా ధన్ తేరాస్ రోజున పూజిస్తారు.

ధన్వంతరి ఆలయం -కేరళ లోని గురువాయూర్ సమీపాన నెల్లువాయ్ అనే గ్రామంలో ఒక పురాతన దేవాలయం ఉంది. ఈ ఆలయంలో అశ్వినీ దేవతలు ధన్వంతరి విగ్రహాన్ని ప్రతిష్టించారని నమ్మకం. ఈ ఆలయం 5000 సంవత్సరాలకు పైగా పురాతనమైనది అని నమ్ముతారు.

తొట్టువ ధన్వంతరి ఆలయం - ఈ ఆలయం ధన్వంతరి భగవంతుని ప్రసిద్ధ దేవాలయం. ఈ ఆలయంలోని దేవుని విగ్రహం దాదాపు 6 అడుగుల ఎత్తు ఉంటుంది. ఈ ఆలయంలో వెన్న ప్రసాదంగా ఇస్తారు.




