
వేద పంచాంగం ప్రకారం గ్రహాలు ఒక నిర్దిష్ట సమయాల్లో ఒక రాశి నుంచి మరొక రాశిలోకి ప్రవేస్తారు. ఇలా గ్రహాల సంచారం జరిగే సమయంలో అవి వివిధ యోగాలను ఏర్పరుస్తాయి. మన జీవితాలపై, సమాజంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతాయి. సెప్టెంబర్‌లో ఒక ప్రత్యేక చతుర్గ్రహి యోగం ఏర్పడుతోంది.. బుధుడు, శుక్రుడు, కేతువు, సూర్యుడు సింహరాశిలో కలవడం ద్వారా ఏర్పడుతుంది. ఈ యోగం కొన్ని రాశులకు చాలా శుభప్రదంగా ఉంటుంది. అదృష్టం ప్రకాశిస్తుంది. సంపద పెరుగుతుంది. అలాగే, నిలిచిపోయిన డబ్బు తిరిగి పొందే అవకాశం ఉంది. ఈ యోగం వలన ఏ రాశుల వారు ప్రత్యేక ఆశీర్వాదాలను పొందబోతున్నారో తెలుసుకోండి..
చతుర్గ్రాహి యోగం అంటే
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఒక నిర్దిష్ట రాశిలో నాలుగు గ్రహాలు ఒకేసారి కలయిక జరగడం చతుర్గ్రాహి యోగం. ఈ యోగం ఏర్పడినప్పుడు కొన్ని రాశులవారికి ఆర్థికంగా, సామాజికంగా అదృష్టం, సంపద, విజయం వంటి లాభాలు కలుగుతాయి. ఇది చాలా అరుదుగా సంభవించే శుభయోగమని జ్యోతిష్య పండితులు చెబుతారు.
సింహ రాశి: చతుర్గ్రహి యోగం ఈ రాశిలో మొదటి ఇంట్లో ఏర్పడుతున్నందున ఇది సింహ రాశి వారికి చాలా శుభప్రదంగా నిరూపించబడుతుంది. ఈ సమయంలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వీరు చేపట్టిన ప్రతి పని విజయవంతమవుతుంది. ప్రజాదరణ పెరుగడంతో పాటు, సూర్యుడు, శుక్రుడు కూడా కెరీర్‌లో ప్రయోజనకరంగా ఉంటాయి. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. వివాహితలు సంతోషకరమైన వైవాహిక జీవితాన్ని గడుపుతారు. జీవిత భాగస్వామి నుంచి సంపూర్ణ మద్దతు లభిస్తుంది. వ్యాపారవేత్తలు ఆర్థిక సమస్యలను ఎదుర్కోవాల్సిన అవసరం ఉండదు. కొత్త భాగస్వాములను చేర్చుకోవడం వల్ల ప్రయోజనం పొందుతారు.
వృశ్చిక రాశి: ఈ రాశికి చెందిన వ్యక్తులకు ఈ యోగం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ సమయంలో వీరి పనిలో మంచి పురోగతి ఉంటుంది. నిర్ణయం తీసుకునే సామర్థ్యం బలంగా ఉంటుంది. ఆఫీసులో మీ సృజనాత్మకత, నాయకత్వ నైపుణ్యానికి ప్రశంసలను అందుకుంటారు. కొత్త అవకాశాలను పొందుతారు. ఈ సమయం కొత్త ప్రాజెక్ట్ ప్రారంభించడానికి లేదా నాయకత్వం వహించడానికి అనుకూలంగా ఉంటుంది. దీనితో పాటు మీ తండ్రితో మీ సంబంధం బలపడుతుంది.
ధనుస్సు రాశి: ఈ రాశికి చెందిన వ్యక్తులకు ఈ యోగం అదృష్ట స్థానంలో ఏర్పడుతోంది. దీని కారణంగా అదృష్టం పూర్తిగా వీరి సొంతం. ఆఫీసులో సమస్యలు తొలగిపోతాయి. చేపట్టిన పనిపై పూర్తి దృష్టి పెడతారు. వ్యాపారంలో ఆర్థిక లాభాలు పొందుతారు. వ్యాపారంలో కొత్త భాగస్వాములు చేరే అవకాశం ఉంది. ఈ సమయంలో దేశీయ, విదేశీ ప్రయాణాలు ఉండవచ్చు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో లేదా శుభ కార్యక్రమాలలో పాల్గొనే అవకాశం కూడా లభిస్తుంది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
(నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.)