- Telugu News Photo Gallery Spiritual photos Bholashankar's Grace: Recognizing Shiva's Blessings in Daily Life
Shiva Blessings: ఈ సంకేతాలు కనిపిస్తే.. శివయ్య అనుగ్రహం మీ పై ఉన్నదననే సంకేతం..
సనాతన ధర్మం విశ్వాసం ప్రకారం.. ఎవరిపైన అయినా సృష్టి లయకారుడైన శివుని ఆశీస్సులు ఉన్నప్పుడు.. అతను జీవితంలో కొన్ని శుభ సంకేతాలను పొందడం ప్రారంభిస్తాడు. ఈ సంకేతాలు సాధారణమైనవిగా అనిపిస్తాయి.. అయితే అటువంటి సంకేతాలు వచ్చినప్పుడు ఆ వ్యక్తి విధి మారుతుంది. ఈ రోజు భోలాశంకరుడి లభించే ఆశీస్సుల సంకేతాలు ఏమిటో తెలుసుకుందాం.
Updated on: Jun 16, 2025 | 8:45 AM

సృష్టి లయకారుడైన శివయ్యను భోలాశంకరుడు అని అంటారు. కేవలం జలంతో అభిషేకం చేసినా పొంగిపోయి కోరిన వరాలు ఇచ్చే దైవం.. అటువంటి జంగమయ్య అనుగ్రహం ఎవరిపైన అయినా కలిగినప్పుడు ఆ వ్యక్తి జీవితంలో కొన్ని శుభ సంకేతాలు కనిపించడం మొదలఅవుతాయి. ఈ సంకేతాలు సాధారణమైనవిగా కనిపిస్తాయి. అయితే ఈ సంకేతాలు కనిపించినప్పుడు ఆ వ్యక్తి విధి మారుతుంది. ఈ రోజు శివుని ఆశీర్వాద సంకేతాలు ఏమిటో తెలుసుకుందాం.

శివుని అనుగ్రహానికి అనేక సంకేతాలు కనిపిస్తాయి. త్రిశూలం, పాము లేదా నెల వంక, చంద్రుడు వంటి శివునికి సంబంధించిన వాటిని కలలలో చూడటంతో పాటు శివుడిని కలలలో చూడటం మొదలైనవి. శివ పురాణం ప్రకారం ఉదయం డమరు శబ్దం వినడం లేదా నందీశ్వరుడికి చిహ్నం అయిన ఎద్దుని చూడటం కూడా శివుని అనుగ్రహానికి సంకేతాలు.

శివుడికి సంబంధించిన విషయాలను చూడటం కూడా శివుని ఆశీస్సులకు సంకేతం. మీరు మీ కలలో త్రిశూలం, పాము, అర్ధ చంద్రుడు లేదా విభూతి వంటి వాటిని చూడటం ప్రారంభిస్తే.. శివుని ఆశీస్సులు మీపై ఉన్నాయని, భోలాశంకరుడు మీతో ఉన్నారని అర్థం చేసుకోండి.

కలలో శివుడిని చూడటం లేదా శివుడికి సంబంధించిన ఏదైనా దైవిక సంఘటనను అనుభవించడం కూడా శుభ సంకేతం. కలలో శివాలయం లేదా శివలింగాన్ని చూడటం కూడా శివుని కృపకు సంకేతం.

శివ పురాణం ప్రకారం ఒక వ్యక్తి తన మనస్సులో డమరుక శబ్దాన్ని వింటే.. అది శివుని కృపకు సంకేతం. ఉదయం నిద్రలేవగానే డమరుక శబ్దాన్ని వినడం కూడా శివుని కృపకు సంకేతం.

హిందూ మత విశ్వాసాల ప్రకారం.. దారిలో నందీశ్వరుడిని దర్శించుకోవడం కూడా శివుడు ప్రసన్నుడయ్యాడని సంకేతంగా పరిగణించబడుతుంది. మీరు ఇంటి నుంచి బయటకు వెళ్ళిన వెంటనే నందీశ్వరుడు అంటే ఎద్దుని చూస్తే శివయ్య అనుగ్రహం మీపై ఉన్నాడని.. శివుడు మీతో ఉన్నాడని అర్థం చేసుకోండి.




