మేషం: జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈ రాశివారిలో అహం భావం కాస్తంత ఎక్కువగా ఉంటుంది. అధికార దాహం కూడా ఎక్కువగానే కనిపిస్తూ ఉంటాయి. ఈ రాశివారు
సాధారణంగా రిజర్వుడుగా ఉంటారు. ఈ రాశిలో గురువు ఉండడం, శనీశ్వరుడు పదకొండవ స్థానం నుంచి వీక్షిస్తూ ఉండడం వంటి కారణాల వల్ల, వీరి తత్వాలకు
కొద్దిగా బ్రేకులు పడే అవకాశం ఉంటుంది. రాశిలో గురు, రాహువులు ఉండడం వల్ల అధికార కాంక్ష కాస్తంత ఎక్కువగానే ఉండే అవకాశం ఉన్నప్పటికీ, శనీశ్వరుడి
దృష్టి వల్ల తప్పనిసరిగా కంట్రోల్ లో ఉండడం, అణగిమణగి ఉండడం వంటివి జరిగే అవకాశం ఉంది.