AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జాగ్రత్త: గర్భధారణ సమయంలో అధికరక్తపోటుకు సంకేతాలివే!

అమ్మ అవ్వడం దేవుడిచ్చిన గొప్ప వరం. ప్రతి మహిళ జీవితంలో తాను తల్లిని కాబోతున్నాను అని తెలిస్తే అది ఆమెకు వెయ్యిరేట్ల ఆనందాన్ిన ఇస్తుంది. అయితే ప్రెగ్నెంట్ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని చెబుతుంటారు. ఇందుకంటే ఇది శరీరంలో అనేక మార్పులను తీసుకొస్తుంది. మరీ ముఖ్యంగా ఈ సమయంలో చాలా మందిని అధికరక్తపోటు ప్రభావితం చేస్తుంది. కాగా, గర్భధారణ సమయంలో అధిక రక్తపోటుకు గల సంకేతాలు ఏవో ఇప్పుడు మనం చూద్దాం.

Samatha J
|

Updated on: Jun 26, 2025 | 4:26 PM

Share
 విపరీతమైన తలనొప్పి.. తల నొప్పి అనేది విపరీతంగా ఉన్నప్పుడు ముఖ్యంగా అది గర్భాధారణ సమయంలోనే ఎక్కువ వస్తున్నప్పుడు తప్పకుండా పలు జాగ్రత్తలు తీసుకోవాలంట. ప్రెగ్నెంట్ ఉమెన్స్ సరిగ్గా విశ్రాంతి తీసుకోకపోవడం వలన ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంటుందంట. అయితే మరీ తీవ్రతరం అయితే అధిక రక్తపోటుకు హెచ్చరిక కావచ్చు. అందుకే తప్పకుండా ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు.

1 / 5
మూత్ర విసర్జనలో ఇబ్బంది లేదా మూత్ర విసర్జన చేయకపోవడం అనేది అధిక రక్తపోటు సమస్యలలో ఒకటిగా చెప్పవచ్చు. ఇది మూత్రపిండాలపై దాని ప్రభావం చూపుతుంది. రక్తం నుండి వ్యర్థాలను ఫిల్టర్ చేసే చిన్న రక్త నాళాలను రక్తపోటు దెబ్బతీసినప్పుడు మూత్రపిండాలు ప్రభావితమవుతాయి. ఈ క్రమంలో మూత్ర విసర్జన సమయంలో ఇబ్బందులు తలెత్తుతుంటాయి. అయితే గర్భిణీ స్త్రీలు  సాధారణం కంటే చాలా తక్కువగా మూత్ర విసర్జన చేస్తున్నట్లు గమనించినప్పుడు లేదా ఆమె మూత్రం నురుగుగా కనిపిస్తే వీరు మూత్ర పిండాల సమస్యతో బాధపడుతున్నట్లే అంటున్నారు ఆరోగ్య నిపుణులు.

2 / 5
గర్భధారణ సమయంలో పాదాలు, చీలమండలలో తేలికపాటి వాపు రావాడం అనేది సహజం. కానీ ఇది అందిరిలో కనిపించదు. కొంత మందిలో ఈ సమస్య అధికంగా ఉంటుంది. అయితే పాదాలు, చీలమండలు, ముఖం, చేతులు అకస్మాత్తుగా వాపు రావడం అనేది రోజు రోజుకు ఎక్కువ అవుతే అది పెద్ద సమస్యనేనంట. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలలో రాత్రి విశ్రాంతి తీసుకొనే సమయంలో ఈ వాపు ఎక్కువగా ఉండటం, లేదా రెండు మూడు రోజుల్లోనే ముఖంపై పెదవుల చుట్టూ, చేతులు చాలా ఎక్కువగా ఉబ్బి, బిగుతుగా ఉంటే ఇది రక్తపోటు సంకేతం అంట.

3 / 5
శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది లేదా ఛాతీ బిగుతుగా అనిపించడం కూడా రక్తపోటు సంకేతం అంటున్నారు ఆరోగ్య నిపుణులు. కొంత మంది గర్భధారణ సమయంలో వేగంగా బరువు పెరిగిపోతారు. దీంతో వారికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తవచ్చు. ఇది సాధారణం. అయితే ఎలాంటి బరువు ఎక్కువ లేకపోయినా, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, లేదా ఛాతి బిగుతుగా అనిపిస్తే తప్పకుండా వైద్యుడిని సంప్రదించాలంట.

4 / 5
ప్రెగ్నెంట్ సమయంలో వాంతులు, వికారం అనేది చాలా కామన్. మరీ ముఖ్యంగా గర్భం ధరించిన మూడు నెలల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. అయితే కొన్ని సార్లు మార్నింగ్ సిక్నెస్ లా కాకుండా, రోజు రోజుకు ఈ సమస్య అనేది విపరీతంగా పెరిగితే ఇది రక్తపోటుకు కారణం అవుతుందంట. అందుకే ఇలాంటి సమస్యలు ఉన్న వారు తప్పకుండా వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం

5 / 5