Honey: కమ్మటి తేనెను వేడి చేస్తే విషంగా మారుతుందా..? నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకోండి…

చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు చాలా మంది తేనెను ఇష్టంగా తింటారు. తేనెలో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. తేనెలో యాంటీబయాటిక్, యాంటీఆక్సిడెంట్ గుణాలు ఉన్నాయి. ఇవి మన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతాయి. తేనెను ఎప్పుడూ వేడి చేయకూడదని, వేడి చేయడం వల్ల తేనె విషంగా మారుతుందని చెబుతుంటారు. అయితే, వేడిచేసిన తర్వాత తేనె నిజంగా విషపూరితమా? ఇప్పుడు తెలుసుకుందాం..

Jyothi Gadda

|

Updated on: Mar 20, 2024 | 9:02 PM

తేనెను వేడి చేయడం వల్ల దానిలోని అన్ని పోషకాలు మరియు ఎంజైమ్‌లు నాశనం అవుతాయి. తేనెలోని అన్ని పోషకాలు, ఎంజైములు పువ్వుల నుండి వస్తాయి. ఈ పువ్వులు తరువాత పండ్లు, కూరగాయలుగా రూపాంతరం చెందుతాయి. మనం కూరగాయలను వండుకుంటాము. కాబట్టి అవి విషపూరితం కావు, వేడిచేసినప్పుడు తేనె ఎలా విషంగా మారుతుందని ప్రశ్నిస్తున్నారు కొందరు ఆరోగ్య నిపుణులు.

1 / 5
Honey

Honey

2 / 5
తేనెలో ఆరోగ్యకరమైన ఎంజైమ్‌లు, అమైనో ఆమ్లాలు, విటమిన్ సి, డి, ఇ, కె, బితో పాటూ బీటాకెరాటిన్, ఎసెన్షియల్ ఆయిల్స్, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్స్ లభిస్తాయి. కానీ తేనును వేడి చేయడం వల్ల ఇవన్నీ వాటి సహజగుణాలను కోల్పోతాయి. అవి ప్రమాదకర సమ్మేళనాలుగా మారచ్చునని పరిశోధకులు వెల్లడించారు.  నివేదిక ప్రకారం కూడా తేనెను వండడం, వేడి చేయడం వల్ల నాణ్యత క్షీణిస్తుంది అని తెలుస్తుంది.

3 / 5
తేనెను 40 డిగ్రీల సెల్సియస్ లేదా అంతకన్నా ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద వేడి చేయడం వల్ల రసాయన మార్పులు తప్పవు. రుచి కూడా చేదుగా మారుతుంది. అందుకే తేనెను సహజంగానే, గది ఉష్ణోగ్రత వద్దనే తినాలి.  తేనెను వేడి చేయాలా వద్దా అనేది వ్యక్తిగత నిర్ణయం, కానీ మీరు తేనె సహజ ప్రయోజనాలను నిలుపుకోవాలనుకుంటే, ముడి తేనెను తీసుకోవడం ఎల్లప్పుడూ ఉత్తమం అంటున్నారు పోషకాహార నిపుణులు.

4 / 5
ఆయుర్వేదం ప్రకారం తేనెను వేడి చేయకూడదని చెబుతున్నారు. వేడి వేడి పదార్థాలలో కూడా తేనెను కలపకూడదని చెబుతుంటారు. ఇలా వేడికి గురైన తేనె తాగడం వల్ల విషపూరిత అణువులు జీర్ణ వ్యవస్థ శ్లేష్మ పొరలకు అంటుకుని అమా అనే టాక్సిన్ గా మారుతాయి. దీనివల్ల కడుపునొప్పితో ఇబ్బంది పడాల్సి వస్తుందని చెప్పారు.. శ్వాసక్రియ, ఇన్సులిన్ సెన్సిటివిటీ, చర్మ వ్యాధులు, బరువు పెరుగడం వంటివి జరుగుతాయంటున్నారు.

5 / 5
Follow us