- Telugu News Photo Gallery Science photos Space walkers of nasa installed solar array at international space station in six and half hours
Space Walkers: ఆరున్నర గంటల ఆపరేషన్ తో అంతరిక్షంలో కొత్త సోలార్ శ్రేణి అమర్చిన నాసా స్పేస్ వాకర్స్
Space Walkers: నాసా శాస్త్రవేత్తలు మరో విజయం సాధించారు. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లో కొత్త సౌర ఫలకాల శ్రేణి (solar array installation)ని విజయవంతంగా అమర్చారు.
Updated on: Jun 22, 2021 | 2:35 PM

Space Walkers: నాసా శాస్త్రవేత్తలు మరో విజయం సాధించారు. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లో కొత్త సౌర ఫలకాల శ్రేణి (solar array installation)ని విజయవంతంగా అమర్చారు. ఫ్లైట్ ఇంజనీర్లు థామస్ పెస్క్వేట్, షాన్ కిమ్బ్రో ఈ స్పేస్ వాక్ లో పాల్గొన్నారు.

స్పేస్ వాకర్స్ అంతరిక్ష కేంద్రంలో రెండవ కొత్త సౌర శ్రేణి ఏర్పాటు చేయడం కోసం సిద్ధం అయ్యారు. దీనినకోసం స్పేస్ వాకర్స్ ముందుగా అవసరమైన ఏర్పాట్లు చేసుకున్నారు. తాము స్పేస్ వాక్ ద్వారా చేయబోయే పనులపై కొన్ని గంటల ముందుగానే అన్ని జాగ్రత్తలతో సిద్ధం అయ్యారు.

రాబోయే స్పేస్‌వాక్‌లో స్పేస్ వాకర్స్ రెండవ రోల్ అవుట్ సౌర శ్రేణిని ఏర్పాటు చేయడానికి అవసరమైన ప్యానల్స్ సిద్ధం చేస్తున్నారు స్పేస్ వాకర్ఫ్.

మొత్తం 6 గంటల 28 నిమిషాల పాటు కొనసాగే స్పేస్‌వాక్‌లో, విద్యుత్ సరఫరాను పెంచడానికి కొత్త రోల్-అవుట్ సౌర శ్రేణుల సమితిలో మొదటిదాన్ని విస్తరించడం పూర్తయింది.

అంతరిక్ష కేంద్రం పసిఫిక్ మీదుగా ఎగురుతున్నప్పుడు తాము చేయబోయే స్పేస్ వాక్ లో రెండవ సౌర శ్రేణి సంస్థాపన కోసం సన్నాహాలు చేస్తున్న స్పేస్ వాకర్స్.

స్పేస్ వాక్ అధికారికంగా ముగిసింది. యునైటెడ్ స్టేట్స్ మీద అంతరిక్ష కేంద్రం లో 60 అడుగుల పొడవైన రోల్ సౌర శ్రేణులు విజయవంతంగా ఏర్పాటు చేశారు స్పేస్ వాకర్స్



