- Telugu News Photo Gallery Science photos A comet that appeared 80,000 years ago has come close to Earth again
Comet: ఆకాశంలో అద్భుతం.. ఖగోళంలో కనువిందు! భూమికి దగ్గరగా తోకచుక్క..
ఖగోళంలో కనువిందు చేసేందుకు విశిష్ట అతిథి విచ్చేసింది. 80 వేల సంవత్సరాల క్రితం కనిపించిన తోకచుక్క మళ్లీ భూమికి దగ్గరగా వచ్చింది. తోకచుక్క ఆకాశంలో అద్భుతమని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతుంటే.. మరికొందరు మాత్రం ఏం అరిష్టం జరుగుతుందోనని టెన్షన్ పడుతున్నారు. ఆకాశం అద్భుతాలకు నెలవు. అంతరిక్షంలో అరుదైన ఘటనలకు మనం సాక్షులమవుతున్నాం. మనపూర్వీకులు చూసిన తోకచుక్కను చూసే అవకాశం మనకు దక్కింది.
Updated on: Oct 01, 2024 | 8:12 AM

కామెట్ సి 2023 ఏ3గా అనే తోకచుక్క.. శుచిన్‌షాన్ - అట్లాస్ పేరుతో పిలుస్తున్నారు. చైనా సైన్సెస్ అకాడమీకి చెందిన పర్పుల్ మౌంటెయిన్ అబ్జర్వేటరీ, హవాయి, చిలీ, దక్షిణాఫ్రికాలకు చెందిన నాలుగు టెలిస్కోపుల సూమూహం.. ఆస్టరాయిడ్ టెరిస్ట్రియల్ ఇంపాక్ట్ లాస్ అలర్ట్ సిస్టమ్ ఈ తోకచుక్కను గుర్తించాయి.

శుచిన్‌షాన్ మొదటిగా 2023 జనవరి 9 గుర్తించగా.. అట్లాస్ అదే ఏడాది ఫిబ్రవరి 22న గుర్తించింది. సెప్టెంబర్ నెలాఖరులో తోకచుక్క కనువిందు చేసింది. 80వేల ఏళ్ల క్రితం కనిపించిన తోక చుక్క మందమైన నక్షత్రంలా మసకగా కనిపించింది.ప్రకాశవంతంగా కనువిందు చేసే ఈ తోకచుక్కను ప్రపంచంలోని ఏ ప్రాంతం నుంచైనా ఎలాంటి పరికరాలు లేకుండా నేరుగా చూడొచ్చు.

సౌర కుటుంబంలో సూర్యుని చుట్టూ దీర్ఘవృత్తాకార కక్ష్యలో పరిభ్రమించే దుమ్ము, ధూళి కణాలు, వాయువులతో ఏర్పడివున్న ఖగోళవస్తువులను తోకచుక్కలని పిలుస్తారు. ఇప్పటి వరకు ఇంచుమించు 600 తోకచుక్కలను గుర్తించారు శాస్త్రవేత్తలు. వీటిలో 513 చాలా దీర్ఘకాలికమైనవి.

ఇంతవరకూ గుర్తించిన తోక చుక్కల్లో ముఖ్యమైంది హేలీ. ఇది ప్రతీ 76 సంవత్సరాలకు ఒకసారి భూమిని సమీపిస్తుంది. సంస్కృతంలో తోకచుక్కను ధూమకేతుగా పిలుస్తారు. పూర్వకాలంలో తోకచుక్క కనిపిస్తే అరిష్టానికి సూచనగా భావించేవారు. తోకచుక్క కనుబడ్డ మార్గంలో దాని తోక ఎన్ని డిగ్రీల ఆక్షాంశ రేఖపై పడిందో అన్ని డిగ్రీల కోణంలో ఉన్న భూభాగాల్లో విషాద ఘటనలు చోటు చేసుకుంటాయన్న అనుమానాలున్నాయి.

ప్రకృతి విపత్తులు సంభవిస్తాయని.. యుద్ధాలు జరుగుతాయని.. ప్రముఖులు చనిపోతారన్న భయాలు ఉన్నాయి.తోకచుక్క పడ్డాకే పాండవులు-కౌరవుల మధ్య యుద్ధం జరిగిందని.. రాముడు వనవాసానికి వెళ్లే ముందు తోకచుక్క కనిపించిందని పండితులు చెబుతున్నారు.





























