
ఈ దీపావళి పండుగకు గ్రహాలన్నీ ప్రత్యేక స్థానంలో ఉండబోతున్నాయంట. అలాగే దాదాపు 500 సంవత్సరాల తర్వాత దీపావళి పండుగ రోజున శని గ్రహం తిరోగమనం చేయనున్నది. దీంతో దీని ప్రభావం 12 రాశులపై ఉండగా, నాలుగు రాశుల వారికి మాత్రం పట్టిందల్లా బంగారమే కానున్నదంట. ఇంతకీ ఆ రాశులు ఏవో ఇప్పుడు చూద్దాం.

మకర రాశి : మకర రాశి వారికి పట్టిందల్లా బంగారమే కానుంది దీపావళి పండుగ రోజే శని తిరోగమనం వలన వీరు అనుకున్న పనులన్నీ పూర్తి చేసుకుంటారు. చాలా రోజుల నుంచి ఎవరైతే ఇంట్లో శుభకార్యాలు జరుపుకోవాలనుకుంటారో వారి కోరిక నెరవేరుతుంది. ఆనందంగా జీవిస్తారు.

మిథున రాశి : మిథున రాశి వారికి చేపట్టిన ప్రతి పనిలో విజయం సొంతం అవుతుంది. అనుకోని విధంగా ఆదాయం పెరగడం వీరికి చాలా సంతోషాన్ని ఇస్తుంది. అదే విధంగా ఎవరైతే కొత్త వ్యాపారం ప్రారంభించాలి అనుకుంటున్నారో వారికి ఇది మంచి సమయం. భాగస్వామ్య వ్యాపారం కూడా కలిసి వస్తుందంట.

కుంభ రాశి : కుంభ రాశి వారికి దీపావళి నుంచి అదృష్టం కలిసిరానున్నది. వీరు ఏ పని చేయాలి అని నిశ్చయించుకున్నా ఆ పని చేసేస్తారు. ఆర్థికంగా కలిసి వస్తుంది. విద్యార్థులకు, ఉద్యోగులకు కూడా అద్భుతంగా ఉండనుంది. ముఖ్యంగా దీపావళి పండుగ సమయంలో ఉద్యోగులు ప్రమోషన్ పొందుతారు. వీరికి ఈ సమయం చాలా అద్భుతంగా గడుస్తుంది.

ధనస్సు రాశి : దీపావళి పండుగ సమయంలో శని తిరోగమనం వలన ఈ రాశి వారి ఆదాయం పెరుగుతుంది. అదృష్టం కలిసి వస్తుంది. అప్పుల సమస్యలు తొలిగిపోతాయి. అనుకోని విధంగా ఎక్కువ మొత్తంలో డబ్బు చేతికందుతుంది. ఇది మీకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకొంటుంది.