- Telugu News Photo Gallery Salt In Tea: Why Should You Add A Pinch Of Salt In Your Tea, Know All Health Benefits here
Salt In Tea: గ్రీన్ టీలో చిటికెడు ఉప్పు కలిపి వారం పాటు తాగండి.. ఆ సమస్యలన్నీ పరార్!
రోజూ ఉదయం ఒక కప్పు టీ తాగందే చాలా మందికి తెల్లారదు. ఇలా రోజుకు కనీసం 4-5 సార్లు టీ తాగేస్తుంటారు. అయితే మీరు రోజూ తాగే టీలో చిన్న మార్పు చేసుకుంటే రుచితోపాటు మంచి ఆరోగ్యం కూడా మీరు సొంతం అవుతుంది. టీలో చక్కెరకు బదులుగా చిటికెడు ఉప్పు కలుపుకోవాలి.. ఛీయాక్.. టీలో ఉప్పా? అని ముఖం వికారంగా పెట్టకండి. దీనిని ఒక వారం పాటు ట్రై చేసి చూడండి ఫలితం మీరే చూస్తారు. చాలా మంది బ్లాక్ టీ, గ్రీన్ టీ, లెమన్ టీలలో చక్కెర కలుపుతుంటారు..
Updated on: Mar 12, 2024 | 9:47 PM

అలాగే టీతో పాటు డ్రై ఫ్రూట్స్ తినకూడదు. ఉదాహరణకు వాల్‌నట్‌లు, బాదం, జీడిపప్పు వంటి మొదలైన డ్రై ఫ్రూట్స్ చాలా పోషకమైనవి. కానీ టీతో వీటిని తినడం మంచిది కాదు. డ్రై ఫ్రూట్స్‌లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇది టీలో ఉండే మూలకాలతో పోటీ పడుతుంది.

చాలా మంది బ్లాక్ టీ, గ్రీన్ టీ, లెమన్ టీలలో చక్కెర కలుపుతుంటారు. ఫలితంగా, చక్కెర అధిక మొత్తంలో మళ్లీ మళ్లీ శరీరంలోకి ప్రవేశిస్తుంటుంది. ఇది ఆరోగ్యానికి మంచిది కాదు. బదులుగా టీలో ఉప్పును జోడించినట్లయితే, ఇది కడుపు జీవక్రియ రేటును నిర్వహించడానికి సహాయపడుతుంది.

టీలో ఉప్పు కలుపుకుని తాగడవ వల్ల రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. గ్రీన్ టీలో ఉప్పు కలిపి తాగితే ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. యాంటీ ఆక్సిడెంట్లతో పాటు జీర్ణక్రియను కూడా మెరుగుపరుస్తుంది. అలాగే బరువు తగ్గాలనుకునే వారు ఇలాగే టీ తాగాల్సిందే.

ఆ ఆహారాల జాబితాలో ముందుగా చెప్పుకోవల్సినది టీ-నిమ్మరసం కాంబినేషన్. టీ, నిమ్మరసం కలిపి తాగకూడదట. నిమ్మకాయల్లో ఉండే విటమిన్ సి, యు టీలో ఉండే కెఫిన్‌తో కలిసి ఆరోగ్య సమస్యలను కలిగిస్తాయంటున్నారు నిపుణుల. టీ, సిట్రిక్ యాసిడ్‌లో ఉండే ట్రేస్ ఎలిమెంట్స్ ఒకదానికొకటి హాని కలిగిస్తాయి. నిమ్మకాయతో టీ తాగడం వల్ల కూడా అనేక జీర్ణ సంబంధిత సమస్యలు వస్తాయి. నిమ్మకాయలోని యాసిడ్, టీలోని ట్రేస్ ఎలిమెంట్స్ కూడా గుండెల్లో మంట, తిమ్మిరిని కలిగిస్తాయి. కాబట్టి టీతో పాటు నిమ్మరసాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోకండి.

చాలా మందికి ఉదయం, సాయంత్రం టీ తాగందే పొద్దు పొడవదు. ఇక టీ తాగుతూ సమోసా, బిస్కట్ వంటి చిరుతిళ్లను ఆస్వాధించడం మనలో చాలా మందికి అలవాటే. అయితే టీతోపాటు కొన్ని ఆహారాలు మర్చిపోయి కూడా తినకూడదంటున్నారు ఆరోగ్య నిపుణులు. అవేంటో తెలుసుకుందాం..




