AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rice Water Cleanser: బియ్యం కడిగిన నీళ్లతో మెరిసే సౌందర్యం మీ సొంతం.. ఎలా వినియోగించాలంటే..

దుమ్ము- ధూళి, కాలుష్యం, మేకప్ కారణంగా చర్మ ఆరోగ్యం మరింత దిగజారిపోతుంది. చర్మ సంరక్షణలో బియ్యం నీళ్లు ప్రభావవంతంగా పనిచేస్తుంది. రైస్ వాటర్ ఫేస్ వాష్ ప్రస్తుత కాలంలో ట్రెండింగ్‌లో ఉంది. బియ్యం కడిగిన నీళ్తు చర్మానికి సహజమైన క్లెన్సర్‌గా పనిచేస్తుంది. మార్కెట్లో దొరికే ప్రసిద్ధ బ్రాండ్ల రైస్ వాటర్ ఫేస్ వాష్‌లను కొనుగోలు చేసే బదులు ఇంట్లోనే సహజంగా తయారు చేసుకోవచ్చు. ఇంట్లో రోజూ అన్నం వండేందుకు బియ్యం కడుగుతుంటారు. ఈ నీళ్లలో అమినో..

Srilakshmi C
|

Updated on: Oct 15, 2023 | 9:52 PM

Share
దుమ్ము- ధూళి, కాలుష్యం, మేకప్ కారణంగా చర్మ ఆరోగ్యం మరింత దిగజారిపోతుంది. చర్మ సంరక్షణలో బియ్యం నీళ్లు ప్రభావవంతంగా పనిచేస్తుంది. రైస్ వాటర్ ఫేస్ వాష్ ప్రస్తుత కాలంలో ట్రెండింగ్‌లో ఉంది. బియ్యం కడిగిన నీళ్తు చర్మానికి సహజమైన క్లెన్సర్‌గా పనిచేస్తుంది.

1 / 5
మార్కెట్లో దొరికే ప్రసిద్ధ బ్రాండ్ల రైస్ వాటర్ ఫేస్ వాష్‌లను కొనుగోలు చేసే బదులు ఇంట్లోనే సహజంగా తయారు చేసుకోవచ్చు. ఇంట్లో రోజూ అన్నం వండేందుకు  బియ్యం కడుగుతుంటారు. ఈ నీళ్లలో అమినో యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్ వంటి అనేక మినరల్స్ ఉంటాయి. ఇది చర్మ ముడతలు, ఫైన్ లైన్లను తొలగిస్తుంది. అలాగే చర్మాన్ని బిగుతుగా కూడా చేస్తుంది.

2 / 5
బియ్యం కడిగిన నీళ్లు చర్మాన్ని శుభ్రపరచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇది చర్మంపై పేరుకుపోయిన మేకప్, నూనెలను తొలగిస్తుంది. చర్మం pH స్థాయిని కూడా క్రమబద్దీకరిస్తుంది.

3 / 5
సీజన్ మారే సమయంలో గాలిలో తేమ క్రమంగా తగ్గుతుంది. ఫలితంగా చర్మం పొడిబారవచ్చు. కానీ బియ్యం నీళ్లతో ముఖాన్ని శుభ్రం చేసుకోవడం వల్ల చర్మం తేమగా ఉంటుంది. పొడి చర్మానికి క్లెన్సర్‌గా బియ్యం కడిగిన నీళ్లు ఉపయోగపడతాయి.

4 / 5
ప్రతి రోజు బియ్యం నీళ్లతో ముఖం శుభ్రం చేసుకోవచ్చు. చర్మ సంరక్షణలో ఇది ఆరోగ్యకరమైన పద్ధతి. బియ్యం కడిగిన నీళ్లు చర్మంపై సహజమైన క్లెన్సర్‌గా పనిచేస్తుంది. దీనిని ఎలా వినియోగించాలంటే.. ముందుగా బియ్యాన్ని కడిగి నీళ్లను స్ప్రే బాటిల్ నింపుకోవాలి. బియ్యం కడిగిన నీటిని టోనర్ లాగా ముఖంపై స్ప్రే చేసుకోవాలి. తర్వాత కాటన్ బాల్‌తో ముఖాన్ని తుడుచుకోవాలి. ఇది చర్మ ఉపరితలంపై పేరుకుపోయిన మురికి, మేకప్, నూనెలను శుభ్రపరుస్తుంది.

5 / 5