- Telugu News Photo Gallery Political photos West bengal election 2021 nandigram constituency election campaign to end today both tmc and bjp road show
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలుః బీజేపీ, టీఎంసీ పోటీ పోటీ ప్రచారం.. నందిగ్రాంలో అమిత్ షా, మమతా రోడ్ షో
పశ్చిమ బెంగాల్ ప్రచారం హోరాహోరీ దశకు చేరుకుంది. నందిగ్రాంలో ఎన్నికల ప్రచారానికి చివరి రోజు కావడంతో బీజేపీ, టీఎంసీ పార్టీ పోటా పోటీ ర్యాలీతో హోరెత్తింది.
Updated on: Mar 30, 2021 | 6:20 PM

పశ్చిమ బెంగాల్ ప్రచారం హోరాహోరీ దశకు చేరుకుంది. నందిగ్రాంలో ఎన్నికల ప్రచారానికి చివరి రోజు కావడంతో బీజేపీ, టీఎంసీ పార్టీ పోటా పోటీ ర్యాలీతో హోరెత్తింది. ఇక్కడి నుంచి టీఎంసీ అభ్యర్థి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, బీజేపీ అభ్యర్థి మమత మాజీ మిత్రుడు సువేందు అధికారి తలపడుతున్నారు.

నందిగ్రామ్‌లో బీజేపీ అభ్యర్థికి మద్దతుగా కేంద్ర హోంమంత్రి అమిత్‌షా రోడ్ షో నిర్వహించారు.

అమిత్ షా రోడ్ షోకి జనం భారీగా తరలివచ్చారు. అడుగడుగునా పూల వర్షం కురిపించారు అభిమానులు.

నందిగ్రామ్‌లో భారీ ర్యాలీ నిర్వహించారు బంగాల్ సీఎం మమతా బెనర్జీ. చక్రాల కుర్చీలోనే కూర్చొని పాదయాత్రకు నేతృత్వం వహించారు.

నందిగ్రామ్ నుంచి బరిలోకి దిగుతున్న ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. ఆ నియోజకవర్గంలో పర్యటించారు. ఇటీవల దీదీ కాలికి గాయం కాగా.. చక్రాల కుర్చీలోనే కూర్చొని ర్యాలీ నిర్వహించారు. కార్యకర్తలు, పార్టీ నేతలు చేపట్టిన పాదయాత్రకు నేతృత్వం వహించారు.

దీదీ స్వయంగా వీల్ ఛైర్‌లో భారీ ర్యాలీలో పాల్గొన్నారు. మమతకు మద్దతుగా పెద్ద ఎత్తున జనం తరలిరావడంతో నందిగ్రామ్ జనసంద్రంగా మారింది.




