- Telugu News Photo Gallery Political photos PM Modi interacts with tribal community, self help groups in Madhya Pradesh, see Photos
PM Modi: సహజమైన సేద్యంపై దృష్టి పెట్టండి.. గిరిజన మహిళలకు ప్రధాని మోదీ సందేశం..
షాదోల్‌లోని పకారియాలో ప్రధాని మోదీ గిరిజన సంఘం నాయకులు, స్వయం సహాయక బృందాలు, పెసా కమిటీల నాయకులు. గ్రామీణ ఫుట్‌బాల్ క్లబ్‌ల కెప్టెన్లతో కూడిన ఖాట్ పంచాయితీని నిర్వహించారు. ప్రజలతో మట్లాడుతూనే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సహజమైన సేద్యంపై కూడా దృష్టి పెట్టాలని అన్నారు.
Updated on: Jul 01, 2023 | 9:29 PM

గత కొద్దిరోజులుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వరుస టూర్లతో బిజీబిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే తాజాగా శనివారం నాడు ప్రధాని మోదీ మధ్యప్రదేశ్‌లో పర్యటించారు.

రాష్ట్రంలోని షాదోల్‌లోని పకారియాలో గిరిజన సంఘం నాయకులు, స్వయం సహాయక సంఘాలు, పెసా కమిటీల నాయకులు, గ్రామీణ ఫుట్‌బాల్ క్లబ్‌ల కెప్టెన్లతో కూడిన ఖాట్ సమావేశంను ప్రధాని మోదీ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా అక్కడి ప్రజలు, చిన్నారులతో ప్రధాని మోదీ ముచ్చటించారు. వారి దగ్గర నుంచి ప్రాంతానికి సంబంధించి విశేషాలను, వివరాలను అడిగి తెలుసుకున్నారు.

అంతేకాకుండా ప్రధాని నరేంద్ర మోదీ స్థానిక ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

షాడోల్‌లోని పకారియా గ్రామంలో ఖాట్ పంచాయితీ సందర్భంగా ప్రజలతో మాట్లాడిన ప్రధాని నరేంద్ర మోదీ .. ప్రకృతి వ్యవసాయంపై కూడా శ్రద్ధ పెట్టాలని సూచించారు. ఆవు ఉంటే 30 ఎకరాల్లో వ్యవసాయం చేయవచ్చని తెలిపారు. ఎరువులు అవసరం లేదని ప్రధాని మోదీ అన్నారు.

గిరిజన ప్రాంతాల్లో పాఠశాలలు, కళాశాలల ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని మా ప్రభుత్వం 400కు పైగా ఏకలవ్య పాఠశాలలను ప్రారంభించిందని ప్రధాని మోదీ అన్నారు.

మధ్యప్రదేశ్‌లో సుమారు 3.57 కోట్ల ఆయుష్మాన్ భారత్ ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన కార్డుల పంపిణీని కూడా ప్రారంభించారు.

షాదోల్ గిరిజన ప్రాబల్యం ఉన్న జిల్లా, ఈ సంఘానికి సహాయం చేయడానికి బీజేపీ నిరంతరం ప్రయత్నాలు చేస్తోంది. బీజేపీ ఎప్పుడూ అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు.




