- Telugu News Photo Gallery Political photos In Telangana, Richest Candidate Has Assets constesting as MLA in Telangana Assembly Election 2023
Telangana Election: అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగిన వారిలో అత్యంత ధనవంతులైన అభ్యర్ధులు వీరే..!
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి జి వివేకానంద అత్యంత ధనిక రాజకీయ నాయకుడుగా నిలిచారు. అదే పార్టీకి చెందిన పి శ్రీనివాస్ రెడ్డి రెండో స్థానంలో ఉండగా, రాజగోపాల్ రెడ్డి మూడోవ స్థానం దక్కించుకున్నారు.
Updated on: Nov 14, 2023 | 2:30 PM

Telangana Elections

Gaddam Vivek

వివేక్ దాఖలు చేసిన అఫిడవిట్ ప్రకారం, అతని భార్య పేరుతో రూ. 41.5 కోట్ల విలువైన అప్పులు ఉన్నట్లు పేర్కొన్నారు. వివేక్ వార్షిక ఆదాయం 2019లో రూ. 4.66 కోట్ల నుండి గత ఆర్థిక సంవత్సరంలో రూ. 6.26 కోట్లకు పెరిగింది. అదే సమయంలో అతని భార్య ఆదాయం రూ. 6.09 కోట్ల నుండి రూ. 9.61 కోట్లకు పెరిగింది.

ఇక మూడో స్థానంలో మునుగోడు నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్ది కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి నిలిచారు. రాజగోపాల్ రెడ్డి ఆస్తుల విలువ రూ. 458.37 కోట్లు గా ప్రకటించారు. గతంలో పోటీ చేసిన సమయానికి కంటే ఆయన ఆస్తుల విలువ బాగా పెరిగాయి. మునుగోడు నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నప్పుడు రూ. 314 కోట్ల ఆస్తులను ప్రకటించినప్పటి నుంచి 2018 నుంచి ఆయన నికర విలువ 45 శాతానికి పైగా పెరిగింది.

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన కంపెనీ సుషీ ఇన్‌ఫ్రా అండ్ మైనింగ్ లిమిటెడ్‌లో 1.24 కోట్ల షేర్లు ఉన్నట్లు ప్రకటించారు. దీని పుస్తక విలువ రూ. 239 కోట్లు. తన కుటుంబానికి రూ. 157 కోట్ల విలువైన స్థిరాస్తులు, రూ. 4.14 కోట్ల అప్పులు ఉన్నాయని అఫిడవిట్‌లో పేర్కొన్నారు.

BRS అభ్యర్థిగా పోటీ చేస్తున్న పైళ్ల శేఖర్ రెడ్డి అత్యంత ధనవంతులైన అభ్యర్థుల జాబితాలో నాలుగోవ స్థానం సంపాదించుకున్నారు. శేఖర్ రెడ్డి తన కుటుంబానికి చెందిన రూ. 227 కోట్ల విలువైన ఆస్తులను రూ. 83 కోట్లకు పైగా అప్పులు కలిగి ఉన్నట్లు ప్రకటించారు.

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు కుటుంబ ఆస్తుల విలువ దాదాపు రూ. 59 కోట్లు, ఇందులోనూ హిందూ అవిభక్త కుటుంబంనకు సంబంధించి రూ 25 కోట్ల అప్పులు ఉన్నట్లు ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్‌లో పేర్కొన్నారు. ఇదిలావుంటే తెలంగాణలోని 119 అసెంబ్లీ స్థానాలకు వివిధ పార్టీలకు చెందిన 4,798 మంది అభ్యర్థులు 5,716 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకారం నవంబర్ 30న పోలింగ్, డిసెంబర్ 3న ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్నాయి.
