- Telugu News Photo Gallery Political photos Former Vice President M Venkaiah Naidu received Padma Vibhushan by President Droupadi Murmu photos Telugu Political photos
Venkaiah Naidu: ‘పద్మ విభూషణ్’ అందుకున్న వెంకయ్య నాయుడు.. 46 ఏళ్ల రాజకీయ జీవితంలో..
ఢిల్లీ వేదికగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా పద్మవిభూషణ్ అవార్డు అందుకున్నారు.. భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్రమోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులు పాల్గొన్నారు. 75 ఏళ్ల వెంకయ్యనాయుడు తన 46 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎమ్మెల్యేగా, బీజేపీ రాష్ట్ర, జాతీయ అధ్యక్షుడిగా, కేంద్రమంత్రిగా, ఉపరాష్ట్రపతిగా విభిన్నహోదాల్లో పనిచేశారు.
Updated on: Apr 22, 2024 | 8:58 PM

దేశంలో వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన ప్రముఖులకు.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పద్మ అవార్డులను అందించారు. ఈ ఏడాది ఐదుగురికి పద్మ విభూషణ్, 17 మందికి పద్మభూషణ్, 110 మందికి పద్మశ్రీ అవార్డులను ప్రకటించింది కేంద్రం.

ఢిల్లీ వేదికగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా పద్మవిభూషణ్ అవార్డు అందుకున్నారు.. భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్రమోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులు పాల్గొన్నారు.

75 ఏళ్ల వెంకయ్యనాయుడు తన 46 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎమ్మెల్యేగా, బీజేపీ రాష్ట్ర, జాతీయ అధ్యక్షుడిగా, కేంద్రమంత్రిగా, ఉపరాష్ట్రపతిగా విభిన్నహోదాల్లో పనిచేశారు.

2017 నుంచి 2022 మధ్యకాలంలో భారత 13వ ఉపరాష్ట్రపతిగా పదవీ బాధ్యతలు నిర్వహించిన వెంకయ్యనాయుడు.. వాజ్‌పేయీ ప్రభుత్వంలో కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రిగానూ పనిచేశారు.

2014 నుంచి 2017 వరకు మోదీ మంత్రివర్గంలో పట్టణాభివృద్ధి, గృహనిర్మాణం, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిగా కీలక బాధ్యతలు నిర్వర్తించారు.

2002 నుంచి 2004 వరకూ బీజేపీ జాతీయ అధ్యక్షుడిగానూ సేవలందించారు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు.




