- Telugu News Photo Gallery Political photos Congress leader rahul gandhi stops for lunch at tea estate in assam
తేయాకు తోటల్లో కూలీలతో కలిసి భోజనం చేసిన రాహుల్ గాంధీ.. అసోం అసెంబ్లీ ఎన్నికల ప్రచార చిత్రాలు..
అసోం అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా నేతలు విస్తృతస్థాయిలో పర్యటిస్తున్నారు. ఈసారి ఎలాగైనా సరే అక్కడ పాగా వేసి సీఎం పీఠాన్ని దక్కించుకోవాలని కాంగ్రెస్ శతవిధాలా ప్రయత్నిస్తోంది.
Updated on: Mar 19, 2021 | 8:25 PM

అసోం అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా నేతలు విస్తృతస్థాయిలో పర్యటిస్తున్నారు. ఈసారి ఎలాగైనా సరే అక్కడ పాగా వేసి సీఎం పీఠాన్ని దక్కించుకోవాలని కాంగ్రెస్ శతవిధాలా ప్రయత్నిస్తోంది. ఇదే క్రమంలో కాంగ్రెస్ నేతలు అస్సాంలో ప్రచారాన్ని వేగవంతం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు ఎంపీ రాహుల్ గాంధీ అసోంలోని తేయాకు తోటల్లో పర్యటించారు.

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ బాగెల్ స్థానిక తేయాకు కూలీలతో కలిసి భోజనం చేశారు.


దిబ్రుగఢ్ జిల్లాలోని చుబ్వా ప్రాంతంలోని పచ్చని టీ ఎస్టేట్ల మధ్యన కూలీలతో ఆయన సరదాగా గడిపారు.

అసోం పర్యటనలో మీ అందరిని కలవటం కోసం ఎదురుచూస్తున్నా. మనల్ని వేరు చేసే శక్తులను కలిసి ఓడిద్దాం. దృఢమైన, శాంతియుత, సంయుక్త అసోంను నిర్మించేందకు కృషి చేద్దామని పిలపునిచ్చారు రాహుల్





























