- Telugu News Photo Gallery PM Modi to inaugurate Joka Esplanade Metro Project Purple Line in Kolkata on December 30th Telugu National News
PM Modi: ప్రారంభోత్సవానికి సిద్ధమైన కోల్‌కతా మెట్రో పర్పుల్ లైన్.. శుక్రవారం పచ్చ జెండా ఊపనున్న ప్రధాని మోదీ..
కోల్‌కతాలో మెట్రో పర్పుల్ లైన్‌ను ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం ప్రారంభించనున్నారు. 6.5 కి.మీలో పొడవున్న ఈ మెట్రో మార్గాన్ని ఏకంగా రూ. 2475 కోట్లతో నిర్మించారు. దీంతో ప్రయాణికుల ట్రాఫిక్ కష్టాలు తగ్గనున్నాయి..
Updated on: Dec 29, 2022 | 1:45 PM

ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కోల్‌కతా మెట్రో పర్పుల్ లైన్ వచ్చే శుక్రవారం ప్రారంభం కానుంది ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రాష్ట్రానికి ఒక రోజు పర్యటనలో హౌరా స్టేషన్ నుంచి జోకా-తరత్లా మెట్రోను ప్రారంభిస్తారు.

జోకా-తరత్లా మెట్రో మార్గాన్ని శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. కోల్‌కతా మెట్రో పర్పుల్ లైన్ (జోకా-తరత్లా) మెట్రోను ప్రారంభిస్తారు బెంగాల్ పర్యటనలో మోదీ వర్చువల్‌గా మెట్రో పర్పుల్ లైన్‌ను ప్రారంభించనున్న సంగతి తెలిసిందే.

6.5 కిలోమీటర్ల పొడవున్న ఈ మెట్రో మార్గాన్ని మొత్తం రూ. 2475 కోట్లతో నిర్మించారు. ఈ నిర్మాణం ద్వారా దక్షిణ కోల్‌కతాకు చెందిన సర్సునా, డక్‌ఘర్, ముచిపరాతో పాటు మరికొన్ని ప్రాంతాలకు ప్రయోజనం కలిగించనుంది.

ఇందులో భాగంగా మెట్రో రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ అరోరా ఇప్పటికే డిసెంబర్ 24వ తేదీన పలు మెట్రో స్టేషన్స్‌లో ప్రయాణీకుల సౌకర్యాలను పరిశీలించారు. ఈ కొత్త మార్గంలో ఆరు స్టేషన్స్‌ను ఏర్పాటు చేశారు.

ఇదిలా ఉంటే ఈ ప్రారంభోత్సవానికి ప్రధానితోపాటు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ , రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, గవర్నర్ హాజరుకానున్నట్లు సమాచారం. అయితే మెట్రో ప్రారంభోత్సవం జరిగినా ప్రయాణికులకు మాత్రం జనవరి 2వ తేదీ నుంచి మెట్రో సేవలు అందుబాటులోకి రానుంది.




