- Telugu News Photo Gallery Paddy Farming: Farmers can adopt these tips before transplanting paddy to get bumper yield
Paddy Farming: మంచి దిగుబడి రావాలంటే నారుమడి మొదలు వరి కోత వరకు ఇలా చేయండి..
Paddy Transplanting Tips: వరి పొలాల్లో కలుపు మొక్కలు వేగంగా పెరుగుతాయని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు. అందుకే వరి నాటు వేసిన 2 రోజుల్లో కలుపు మందులను పిచికారీ చేయాలి.
Updated on: Jul 06, 2023 | 12:50 PM

తెలుగు రాష్ట్రంలో వరి ఎక్కువగా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో సాగవుతున్న ప్రధాన పంట ఇదే. వర్షపాతం, నీటి లభ్యతపై వరి పంట ఆధారపడి ఉంటుంది. ఏడాదిలో ఖరీఫ్, రబీ సమయాల్లో సాగు చేస్తున్నారు.

మన ఆహార భద్రత వరి పంటపై ఆధారపడి ఉంది. దేశానికే తెలుగు రాష్ట్రాలను అన్నపూర్ణేశ్వరిగా పిలుస్తారు. విరిని భారీ మొత్తంలో ఎగుమతి చేస్తున్న రాష్ట్రాలు మనవే కావడం విశేషం. అందుకే వరిసాగులో నాణ్యమైన విత్తన ఎంపిక నుంచి మొదలు వరి కోత వరకు సరైన యాజమాన్య మెళకువలు పాటిచాలి. దీంతో సాగు ఖర్చు తగ్గి మంచి దిగుబడులు లభిస్తుంది.

వరి నాట్లు ఇంకా ప్రారంభించని రైతుల కోసం ఒక గొప్ప చిట్కాతో ముందుకు వచ్చాము. రైతులు కింద పేర్కొన్న చిట్కాలు, పద్ధతులను అనుసరించి వరిని విత్తినట్లయితే, తక్కువ ఖర్చుతో బంపర్ దిగుబడిని పొందుతారు.

వరి నాటే ముందు రైతు సోదరులు పొలాన్ని దున్నాలి. దీని తరువాత, వాటిని బాగా ఎంపిక చేయడం ద్వారా పొలం నుండి కలుపు మొక్కలను తొలగించండి. అలా చేయకుంటే దిగుబడిపై ప్రభావం చూపుతుంది.

వరి నారు ఒక్కసారిగా పసుపు రంగులోకి మారాయని పలువురు రైతులు వాపోతున్నారని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆ రైతులు నారు అలికిన తర్వాత యూరియా, జింక్ సల్ఫేట్ చల్లాలి. దీంతో పసుపు సమస్య తొలగిపోయి నర్సరీ పచ్చగా ఉంటుంది.

వరి పొలాల్లో కలుపు మొక్కలు వేగంగా పెరుగుతాయని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు. అందుకే వరి నాటు వేసిన 2 రోజుల్లో కలుపు మందులను పిచికారీ చేయాలి. దీని వల్ల పొలంలో కలుపు మొక్కలు పెరగకుండా వరి దిగుబడి బాగా వస్తుంది.

ఇలా మార్కెట్ లో అనేక కంపెనీల కలుపు మందులు అందుబాటులో ఉన్నా పెండిమిథిలిన్ అనే మందుని వరి పొలంలో పిచికారీ చేస్తే బాగుంటుంది. మీరు 3 మి.లీ పెండిమిథైలిన్‌ను ఒక లీటరు నీటిలో కలిపి 1 ఎకరం పొలంలో చల్లాలి.

కలుపు మొక్కలను నియంత్రించడానికి నాటిన 22 రోజుల తర్వాత బిస్పరిబాక్ సోడియంతో పొలంలో పిచికారీ చేయాలి. దీంతో వరి మొక్కలు వేగంగా పెరుగుతాయి. రైతు సోదరులు పైన పేర్కొన్న పద్ధతులను అవలంబిస్తే వరి దిగుబడి బాగా వస్తుంది.

ఖర్చు తగ్గించుకునేందకు ఆధునిక పద్దతులను అనుసరిస్తూనే.. ఎరువులను కాకుండా గో ఆదారిత వ్యవసాయం చేయడం వల్ల అధిక లాభం వస్తుంది.





























