- Telugu News Photo Gallery Office of the Honorary Consul of the Republic of Kazakhstan in Hyderabad States of Telangana and Andhra Pradesh, India
Hyderabad: పలువురు ప్రముఖులతో కజకిస్తాన్ రాయబారి లంచ్ మీట్.. ఏం చర్చించారంటే..
Hyderabad: ఈ విందుకు ప్రముఖ ప్రతినిధులు హాజరయ్యారు. వీరిలో అలియాక్సాండర్ మత్సుకో - ముంబైలోని బెలారస్ కాన్సుల్ జనరల్, రోహిత్ షోరే - వ్యవస్థాపకుడు, మేనేజింగ్ డైరెక్టర్, కాజిన్ DMC, అల్మట్టి. NSN మోహన్ - డిప్యూటీ వైస్ ప్రెసిడెంట్, SKAL ఇంటర్నేషనల్..
Updated on: Sep 10, 2025 | 9:32 PM

Hyderabad: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు హైదరాబాద్‌లోని రిపబ్లిక్ ఆఫ్ కజకిస్థాన్ గౌరవ కాన్సుల్ అయిన హిస్ ఎక్సలెన్సీ డాక్టర్ నవాబ్ మీర్ నాసిర్ అలీ ఖాన్.. ముంబైలోని బెలారస్ కాన్సుల్ జనరల్ హిస్ ఎక్సలెన్సీ అలియాక్సాండర్ మత్సుకో గౌరవార్థం హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో లంచ్ ఏర్పాటు చేశారు. గౌరవ కాన్సుల్ డాక్టర్ నవాబ్ మీర్ నాసిర్ అలీ ఖాన్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహిస్తారు.

గౌరవ కాన్సులేట్ కార్యాలయం 2021లో హైదరాబాద్‌లోని సదరన్ మెట్రోపాలిటన్ నగరంలో స్థాపించారు. ఈ కాన్సులేట్ భారతదేశం, కజకిస్తాన్ మధ్య దౌత్య, ఆర్థిక సంబంధాలను బలోపేతం చేయడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. హైదరాబాద్‌లోని రిపబ్లిక్ ఆఫ్ కజకిస్తాన్ గౌరవ కాన్సులేట్ కార్యాలయం Xanadu, Plot no. 675, Road no. 34, Jubilee Hills, Hyderabad-500033లో ఉంది. దీని గౌరవ కాన్సుల్ డాక్టర్ నవాబ్ మీర్ నాసిర్ అలీ ఖాన్.

ఈ విందుకు ప్రముఖ ప్రతినిధులు హాజరయ్యారు. వీరిలో అలియాక్సాండర్ మత్సుకో - ముంబైలోని బెలారస్ కాన్సుల్ జనరల్, రోహిత్ షోరే - వ్యవస్థాపకుడు, మేనేజింగ్ డైరెక్టర్, కాజిన్ DMC, అల్మట్టి. NSN మోహన్ - డిప్యూటీ వైస్ ప్రెసిడెంట్, SKAL ఇంటర్నేషనల్. మిస్టర్ అలాన్ ఆటంకులోవ్ – కంట్రీ హెడ్ (భారతదేశం), ఎయిర్ అస్తానా, ఆశిష్ కుమార్ - చీఫ్ కమర్షియల్ ఆఫీసర్, GMR విమానాశ్రయం. ఆనంద ఆచార్య - GMR విమానాశ్రయం, ఎయిర్‌లైన్ మార్కెటింగ్ అండ్ రూట్ డెవలప్‌మెంట్ హెడ్. శ్రీ వాల్మీకి హరి కిషన్ – డైరెక్టర్, వాల్మీకి ట్రావెల్ అండ్ టూరిజం సొల్యూషన్స్ ఉన్నారు.

ఈ కార్యక్రమంలో కజకిస్తాన్, బెలారస్, భారతదేశం మధ్య విమానయాన కనెక్టివిటీ, పర్యాటక ప్రమోషన్‌పై ప్రత్యేక దృష్టి సారించి, దౌత్యపరమైన సద్భావన, సాంస్కృతిక మార్పిడి, వ్యాపార సహకారాన్ని బలోపేతం చేయడంపై చర్చలు జరిగాయి. సాయంత్రం తరువాత కాజిన్ డిఎంసి, ఎయిర్ అస్తానా, బెలావియా ఎయిర్‌లైన్స్‌తో కలిసి హైదరాబాద్‌లోని తాజ్ వివాంటాలో వాల్మీకి ఈవెంట్స్ హైదరాబాద్ నిర్వహించిన హై టీ రిసెప్షన్ జరిగింది. ఈ షోకేస్ కజకిస్తాన్, బెలారస్, అజర్‌బైజాన్, జార్జియా అంతటా సజావుగా ప్రయాణ కనెక్టివిటీ, అభివృద్ధి చెందుతున్న గమ్యస్థానాలను హైలైట్ చేసింది.

ఈ సందర్భంగా వాల్మీకి ట్రావెల్ అండ్ టూరిజం సొల్యూషన్స్ డైరెక్టర్ శ్రీ వాల్మీకి హరి కిషన్ కు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో కజకిస్తాన్ ను ప్రోత్సహించడంలో ఆయన చేసిన అత్యుత్తమ కృషికి గాను హిజ్ ఎక్సలెన్సీ డాక్టర్ నవాబ్ మీర్ నాసిర్ అలీ ఖాన్ అవార్డును ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన హిజ్ ఎక్సలెన్సీ డాక్టర్ నవాబ్ మీర్ నాసిర్ అలీ ఖాన్, హిజ్ ఎక్సలెన్సీ అలియాక్సాండర్ మత్సుకో, పాల్గొనే దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు, పర్యాటక మార్పిడి, పరస్పర సహకారాన్ని పెంపొందించడానికి తమ నిబద్ధతను పునరుద్ఘాటించారు
