నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాల్లో ఒకటిగా నిలవనుంది. మొత్తం ప్రాజెక్ట్ నాలుగు దశల్లో (ఫేజ్-1 నుంచి ఫేజ్-4) అభివృద్ధి చేయబడుతోంది. దీని విస్తీర్ణం దశల వారీగా మారుతుంది. మొదటి దశ సుమారు 3,296 ఎకరాలు ఇందులో ఒక రన్‌వే (3,900 మీటర్లు), ప్యాసింజర్ టెర్మినల్, కార్గో టెర్మినల్, ATC టవర్, టాక్సీవేస్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి.ఈ ఎయిర్ పోర్టు పూర్తి అభివృద్ధి జరిగితే సుమారు 11,750 -12000 ఎకరాలు వరకు విస్తరించనుంది. ఇందులో 5 రన్‌వేలు, అనేక టెర్మినల్స్ ఉండనున్నాయి. మొదటి దశకు సుమారు 3,300 ఎకరాలు ఇప్పటికే సేకరించబడ్డాయి. తదుపరి దశల కోసం అదనపు భూమి సేకరణ జరుగుతోంది..ప్రస్తుతం ప్రారంభమవుతున్న మొదటి దశ 3,296 ఎకరాల్లో ఉంది. నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం అత్యాధునిక హంగులతో నిర్మితమైంది.మొదటి దశలో భాగంగా సంవత్సరానికి 12 మిలియన్ ప్యాసింజర్లు ఈ విమానాశ్రయం నుంచి ప్రయాణించే సామర్థ్యం కలిగి ఉంది. 3,900 మీటర్ల పొడవైన రన్‌వే, వైడ్-బాడీ విమానాలను సులభంగా నిర్వహించగల సామర్థ్యం ఉంది.. అన్ని వాతావరణ పరిస్థితుల్లో 24 గంటల కార్యకలాపాలకు మద్దతు ఇచ్చే ఇన్‌స్ట్రుమెంట్ ల్యాండింగ్ సిస్టమ్ (ILS), అధునాతన నావిగేషన్ వ్యవస్థలు, ఎయిర్‌ఫీల్డ్ లైటింగ్ వ్యవస్థలు కలిగి ఉంది