ధనలక్ష్మీ రాజయోగం.. లైఫ్ టర్న్ అయ్యే రాశులివే!
జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల సంచారం అనేది కామన్. అయితే గ్రహసంచారం అనేది 12 రాశులపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. ఇక గ్రహాల సంచారం వలన రాజయోగాలు ఏర్పడుతుంటాయి. అయితే జూన్ నెలలో అనేక రాజయోగాలు ఏర్పడనున్నాయి. ఈ క్రమంలోనే ధనలక్ష్మీ రాజయోగం కూడా ఏర్పడనుంది. దీని వలన నాలుగు రాశుల వారికి అద్భుతంగా ఉండబోతుంది. ఆర్థికంగా ఆరోగ్య పరంగా చాలా బాగుంటుంది. కాగా, ఆ రాశులు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.
Updated on: Jun 09, 2025 | 1:47 PM

జ్యోతిష్యశాస్త్రంలో చాలా శక్తివంతమైన గ్రహాల్లో గురు గ్రహం ఒకటి. అయితే ఈ గ్రహం అస్తమించి జూన్9 (నేడు) మిథున రాశిలో ఉదయిస్తుందంట. దీని వలన ధనలక్ష్మీ రాజయోగం ఏర్పడుతుంది. ఈ రాజయోగం వలన నాలుగు రాశుల వారికి పట్టిందల్లా బంగారమే కానుందంట. ఏపని చేపట్టినా అందులో విజయం వీరిదే అవుతుంది అంటున్నారు పండితులు. ఇంతకీ ఆ రాశులు ఏవి అంటే.

మీన రాశి :మీన రాశి వారికి గురు, బుధుల కలయిక వలన అన్నింటా శుభమే కలగనుంది. వీరికి అనేక ప్రయోజనాలు చేకూరుతాయి. కోర్టుపరమైన వ్యవహారాలు మీకు అనుకూలంగా వస్తాయి. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. వ్యాపారస్తులకు, సేవారంగంలో ఉన్నవారికి అనేక ప్రయోజనాలు కలగనున్నాయి. డబ్బుపరమైన సమస్యల నుంచి విముక్తి పొందుతారు. ఆరోగ్యం బాగుంటుంది.

కర్కాటక రాశి : కర్కాటక రాశి వారికి ధనలక్ష్మీ రాజయోగం వలన లక్ష్మీకటాక్షం కలిగి అప్పులు తీరిపోతాయి. ఆర్థికంగా కలిసి వస్తుంది. ఆదాయమార్గాలు పుట్టుకొస్తాయి. అంతే కాకుండా రానీ బాకీలు వసూలు అవుతాయి. కుటుంబంతో ఆనందంగా గడుపుతారు. ఉద్యోగం కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారు త్వరలో జాబ్ కొట్టే ఛాన్స్ ఉంది. ప్రయాణాలు లాభసాటిగా ఉంటాయి.

తుల రాశి : ధనలక్ష్మీ రాజయోగం వలన తుల రాశి వారికి ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకొంటుంది. పట్టిందల్లా బంగారమే కానుంది. ఆర్థికంగా కలిసి వస్తుంది. అనుకోని మార్గాల ద్వారా డబ్బు చేతికందుతుంది.ఉద్యోగస్తులు ప్రమోషన్స్ పొందే ఛాన్స్ ఉంటుంది. ఇంట్లో శుభకార్యలు కూడా జరుపుకుంటారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా ప్రయాణాలు చేస్తారు.

కన్యా రాశి : కన్యారాశి వారికి ధనలక్ష్మీ రాజయోగం వలన ఇంట్లో సంపద పెరుగుతుంది. ఉద్యోగంలో ప్రమోషన్స్ అందుకునే ఛాన్స్ ఉంది.అప్పుల నుంచి విముక్తి పొందుతారు. గతంలో చేసిన పెట్టుబడులు మంచి లాభాలు తీసుకొస్తాయి. కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడతాయి. దాంపత్య జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది. ప్రేమ సంబంధాలు బలపడతాయి.



















