- Telugu News Photo Gallery Last Day For New Year Offer discount offers on cars year ender 2022 save up to rs 2 50 lakh on jeep maruti suzuki tata mahindra
Car Sales: కొత్త కారు కొనాలనుకుంటున్నారా? రూ. 2.5 లక్షలు ఆదా చేసుకోవచ్చు.. ఇదే లాస్ట్ ఛాన్స్!
ఇదే చివరి అవకాశం.. కొత్త కారు కొనాలనుకుంటున్నారా.? దాదాపు రూ. 2.5 లక్షలు ఆదా చేసుకోవచ్చు. మారుతీ సుజుకి, టాటా, మహీంద్రా, హ్యుందాయ్ పలు మోడల్స్‌పై న్యూఇయర్ ఆఫర్లు ప్రకటించాయి.
Updated on: Dec 31, 2022 | 3:36 PM

ఇదే చివరి అవకాశం.. కొత్త కారు కొనాలనుకుంటున్నారా.? దాదాపు రూ. 2.5 లక్షలు ఆదా చేసుకోవచ్చు. ప్రముఖ కార్ల తయారీ కంపెనీలు మారుతీ సుజుకి, టాటా, మహీంద్రా, హ్యుందాయ్ పలు మోడల్స్‌పై న్యూఇయర్ ఆఫర్లు ప్రకటించాయి. అది ఈరోజుతో పూర్తి కానుంది. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..

కొత్త మారుతి కారు కొనుగోలుపై రూ. 75,000 వరకు తగ్గింపు లభిస్తుంది. ఈ ఆఫర్ సెలెరియో, ఎస్-ప్రెస్సో మోడల్స్‌కు వరిస్తుంది. ఇదే కాకుండా ఇగ్నిస్‌పై రూ. 57,200, ఆల్టో 800పై రూ. 57,000, ఆల్టో కె10పై రూ. 57,000, సియాజ్‌పై రూ. 55,200, ఈకోపై రూ. 38,000, బాలెనోపై రూ. 20,000, డిజైర్‌పై రూ. 10,000 డిస్కౌంట్ ప్రకటించింది మారుతీ సుజుకి.

టాటా మోటార్స్ కూడా న్యూఇయర్ కోసం బంపర్ డిస్కౌంట్ ఆఫర్లను ప్రకటించింది. సఫారీ, హారియర్ SUVలపై కంపెనీ గరిష్ట తగ్గింపును అందిస్తోంది. ఈ రెండు కార్లలో దేనినైనా కొనుగోలు చేస్తే రూ. 1 లక్ష తగ్గింపు లభిస్తుంది. అదే సమయంలో, టిగోర్‌పై 43,000, టియాగోపై రూ.38,000 తగ్గింపు ఇస్తుంది.

SUV కార్ల స్పెషలిస్ట్ కంపెనీ మహీంద్రా కూడా లక్ష రూపాయల వరకు తగ్గింపును అందిస్తోంది. మహీంద్రా XUV300 కొనుగోలుపై రూ. 1 లక్ష తగ్గింపు లభిస్తోంది. ఇది కాకుండా మరాజోపై రూ.67,200, బొలెరోపై రూ.95,000 డిస్కౌంట్‌ను అందిస్తోంది. డిసెంబర్‌లో మహీంద్రా SUV కొనుగోలుపై ఈ ఆఫర్‌లను పొందవచ్చు.

దక్షిణ కొరియా కంపెనీ హ్యుందాయ్ కూడా డిస్కౌంట్లను ప్రకటించింది. కొత్త కారు కొనుగోలుపై కంపెనీ రూ.63,000 వరకు తగ్గింపును అందిస్తోంది. గ్రాండ్ i10 Nios, i20 కొనుగోలుపై గరిష్ట తగ్గింపు ఉంటుంది. ఈ రెండు మోడళ్లపై కంపెనీ రూ.63,000 డిస్కౌంట్ అందిస్తోంది. అలాగే సెడాన్ హ్యుందాయ్ ఆరాను కొనుగోలు చేస్తే, మీరు రూ. 43,000 ఆదా చేసుకోవచ్చు.

మీరు SUV కార్లను ఇష్టపడితే, జీప్ మోడల్‌లు గొప్ప ఎంపిక. కొత్త జీపు కొనుగోలుపై లక్షల్లో తగ్గింపు లభిస్తోంది. కొత్త సంవత్సరానికి ముందు జీప్ కంపాస్ మోడల్ కొనుగోలుపై రూ.1.50 లక్షల తగ్గింపు పొందవచ్చు. ఇది కాకుండా, అలాగే జీప్ మెరిడియన్‌పై రూ.2.50 లక్షల డిస్కౌంట్ లభిస్తోంది.





























