
మిథున రాశి : మిథున రాశి వారికి కుటుంబంలోని సమస్యలు తొలిగిపోతాయి. వైద్య రంగంలో, కళా రంగంలో ఉన్నవారికి కలిసి వస్తుంది. ఈ రాశి వారు విలువైన బంగారం లేదా వెండి కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఆర్థికంగా అద్భుతంగా ఉంటుంది. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకుంటుంది.

మీన రాశి : గురు గ్రహం ప్రభావం వలన మీన రాశి వారికి పట్టిందల్లా బంగారమే కానుంది. ఈ రాశి వారికి ఆర్థికంగా అనేకప్రయోజనాలు చేకూరనున్నాయి. విద్యార్థులు మంచి ర్యాంకులు పొందుతారు. ఇంటా బయట సంతోషకర వాతావరణం ఉంటుంది. ఈ రాశి వారికి దీపావళి ముందే ఇంక్రిమెంట్స్ చేతికందుతాయి. దీంతో కుటుంబంతో ఆనందంగా పండుగను జరుపుకుంటారు.

కర్కాటక రాశి : కర్కాటక రాశి వారికి ఆర్థికంగా కలిసి వస్తుంది. పనుల్లో ఆటంకాలు తొలిగిపోతాయి. విద్యార్థులు విదేశీ ప్రయాణాల కోసం చేస్తున్న ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. వ్యాపారస్తులు మంచి లాభాలు పొందుతారు. దీపావళి పండుగకు ముందు నుంచే వీరి జీవితం ఆనందంగా ఉంటుంది.

ధనస్సు రాశి : ధనస్సు రాశి వారికి పట్టిందల్లా బంగారమే కానుంది. ఆర్థికంగా, ఆరోగ్య పరంగా కలిసి వస్తుంది. విద్యార్థులు మంచి ర్యాంకులు సంపాదించుకుంటారు. ఆదాయం పెరుగుతుంది. అనుకని విధంగా డబ్బు చేతికందుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.

ధనస్సు రాశి : అంతే కాకుండా ఈ రాశి వారి వైవాహిక బంధం కూడా అద్భుతంగా ఉంటుంది. గత కొన్ని రోజుల నుంచి ఉన్న కలహాలు దూరమై ఈ రాశి వార కుటుంబ సభ్యులతో ఆనందంగా జీవిస్తారు.