- Telugu News Photo Gallery If you include these special teas in your diet, your bloated stomach will melt away.
ఈ స్పెషల్ టీలు డైట్లో ఉంటే.. గుట్టలాంటి పొట్ట ఇట్టే కరిగిపోతుంది
వేడివేడిగా కప్పు టీ లేదా కాఫీ తాగితే ఆ హాయేవేరు. టీ తాగడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వివిధ రకాల టీలు అపానవాయువు, అజీర్ణం నుంచి బరువు తగ్గడం వరకు అనేక సమస్యలను పరిష్కరిస్తాయి. అయితే ఎప్పటి మాదిరిగానే టీ డికాషిన్‌తో కాకుండా ఈ ప్రత్యేకమైన పదార్ధాలతో చేసిన టీ తాగితే అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందొచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఆ స్పెషల్ టీ ఎలా తయారు చేయాలో ఇక్కడ తెలుసుకుందాం..
Updated on: Aug 31, 2025 | 2:20 PM

వేడివేడిగా కప్పు టీ లేదా కాఫీ తాగితే ఆ హాయేవేరు. టీ తాగడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వివిధ రకాల టీలు అపానవాయువు, అజీర్ణం నుంచి బరువు తగ్గడం వరకు అనేక సమస్యలను పరిష్కరిస్తాయని అంటున్నారు నిపుణులు.

ఎప్పటి మాదిరిగానే టీ డికాషిన్‌తో కాకుండా ఈ ప్రత్యేకమైన పదార్ధాలతో చేసిన టీ తాగితే అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందొచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఆ స్పెషల్ టీ ఏంటో.. ఎలా తయారు చేయాలో ఈరోజు ఇక్కడ మనం వివరంగా తెలుసుకుందాం..

పుదీనా టీ: పుదీనా ఆకులు అజీర్ణానికి చక్కని పరిష్కారం. ఈ ఆకులతో మెడిసిన్ కూడా తయారు చేస్తారు. అయితే ఈ ఆకులతో తయారు చేసిన టీ అజీర్ణం, నోటి దుర్వాసన, మానసిక అలసటను నివారించడానికి ఎంతో ప్రభావవంతంగా పని చేస్తుంది. మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో కూడా ఈ టీ బలేగా ఉపయోగపడుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. తాజా పుదీనా ఆకులను వేడి నీటిలో వేసి మరిగించి కాసేపు మూత పెట్టాలి. కావాలంటే పుదీనా ఆకుల పొడిని కూడా కలుపుకోవచ్చు. ఇలా పుదీనా టీ తయారు చేసుకోవచ్చు.

లవంగం టీ - జీర్ణక్రియను మెరుగుపరచడంలో లవంగాలు మంచి ఎంపిక. లవంగాలలోని పదార్ధం జీర్ణ ఎంజైమ్‌ల విడుదలలో సహాయపడుతుంది. ఇందులోని యూజినాల్ జీర్ణాశయంలో మంటను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. ఫలితంగా జీర్ణశక్తి పెరుగుతుంది. లవంగాలు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో కూడా సహాయపడతాయి. కొన్ని లవంగాలను వేడి నీటిలో వేసి మరిగించాలి. కావాలంటే అల్లం వేసుకోవచ్చు.

జీలకర్ర టీ - జీలకర్ర జీర్ణక్రియలో సహాయపడుతుంది. ఇందులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. అపానవాయువు, గ్యాస్, అజీర్తిని తొలగించడంలో జీలకర్ర బాగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా, ఇది ఆందోళనను తొలగించి మంచి నిద్రను కలిగించడంలో కూడా సహాయపడుతుంది. జీలకర్రను నీళ్లతో మరిగించి వడకట్టడం వల్ల కడుపు సమస్యలకు మేలు జరుగుతుంది.




