- Telugu News Photo Gallery ICICI Bank Credit Card Holders ALERT! Now you will have to pay 1 percent charge for this service starting October 20
Credit Card Holders ALERT: క్రెడిట్ కార్డు వాడే వారికి షాకిచ్చిన ఐసీఐసీఐ బ్యాంకు.. అక్టోబర్ 20 నుంచి బాదుడు..
Credit Card Holders ALERT: బ్యాంకులు కొత్తకొత్త నిర్ణయాలు అమల్లోకి తీసుకువస్తుంటాయి. ముఖ్యంగా క్రెడిట్ కార్డుల విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. ఇందుకు సంబంధించిన ..
Updated on: Sep 21, 2022 | 5:10 AM

Credit Card Holders ALERT: బ్యాంకులు కొత్తకొత్త నిర్ణయాలు అమల్లోకి తీసుకువస్తుంటాయి. ముఖ్యంగా క్రెడిట్ కార్డుల విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. ఇందుకు సంబంధించిన కొత్త కొత్త నియమ నిబంధనలు జారీ చేస్తుంటాయి బ్యాంకులు. ఇక ఐసీఐసీఐ బ్యాంకు క్రెడిట్ కార్డుదారులకు మంగళవారం ఆ బ్యాంకు ఓ హెచ్చరిక జారీ చేసింది.

అక్టోబర్ 20 నుంచి క్రెడిట్ కార్డు సేవలపై 1 శాతం సర్వీసు ఛార్జీని విధించేందుకు నిర్ణయించింది ఐసీఐసీఐ బ్యాంకు. ఈ నిర్ణయంతో క్రెడిట్ కార్డు వాడేవారిపై అదనపు భారం పడనుంది. ఐసీఐసీఐ బ్యాంక్‌కి భారతదేశంలో 11 మిలియన్లకు పైగా క్రెడిట్ కార్డుదారులున్నారు. కార్డుల చెల్లింపులపై 1శాతం ఛార్జీని కొత్తగా ప్రవేశపెట్టింది. క్రెడిట్ కార్డ్‌లను ఉపయోగించి అద్దె చెల్లింపును సులభతరం చేసే ప్లాట్‌ఫారమ్‌లు విధించే సేవా ఛార్జీకి ఇది అదనం.

అయితే వచ్చే నెల 20 నుంచి క్రెడిట్ కార్డు అన్ని లావాదేవీలపై ఈ ఛార్జీని వసూలు చేయనున్నట్లు బ్యాంకు తెలిపింది. ఈ మధ్య కాలంలో క్రెడిట్ కార్డులు వాడే వారి సంఖ్య చాలా పెరిగిపోయింది. ఈ కార్డులను షాపింగ్స్, అద్దె చెల్లింపు, ఇతర చెల్లింపులను ఎక్కువగా జరుపుతున్నారు. దీంతో పలు బ్యాంకులు క్రెడిట్ కార్డుల వాడకంపై పలు రకాల ఛార్జీలు కూడా విధిస్తున్నాయి.

అయితే క్రెడిట్ కార్డు వాడటంలో లాభాలు ఉన్నా.. నష్టలు కూడా ఉన్నాయి. సరైన సమయంలో బిల్లు చెల్లించని సమయంలో మీరు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంది. కార్డును సక్రమంగా వాడుతూ సరైన సమయంలో బిల్లు చెల్లిస్తేనే ఉపయోగకరంగా ఉంటుంది. లేకపోతే పెనాల్టీ ఛార్జీలతో నష్టపోయే అవకాశం ఉంది.




