AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chia Seeds: వేగంగా బరువుతగ్గాలనుకుంటున్నారా? అయితే రోజూ ఈ నీటిని గ్లాసుడు తాగండి

బరవు తగ్గడానికి చాలా మంది నానా హైరానా పడిపోతుంటారు. అయితే ఈ సింపుల్‌ ట్రిక్స్‌తో సులువుగా బరువు తగ్గొచ్చంటున్నారు పోషకాహార నిపుణులు. చియా విత్తనాలు బరువు తగ్గడానికి కూడా మేలు చేస్తాయి. ఇవి చూసేందుకు తులసి గింజల్లా కనిపిస్తాయి. ఈ గింజలను తింటే శరీరంలోని కొవ్వు వేగంగా తగ్గుతుంది. అంతే కాదు, విటమిన్లు నిండిన ఈ గింజలలో అనేక ఇతర గుణాలు కూడా ఉన్నాయి..

Srilakshmi C
|

Updated on: Aug 11, 2024 | 1:13 PM

Share
బరవు తగ్గడానికి చాలా మంది నానా హైరానా పడిపోతుంటారు. అయితే ఈ సింపుల్‌ ట్రిక్స్‌తో సులువుగా బరువు తగ్గొచ్చంటున్నారు పోషకాహార నిపుణులు. చియా విత్తనాలు బరువు తగ్గడానికి కూడా మేలు చేస్తాయి. ఇవి చూసేందుకు తులసి గింజల్లా కనిపిస్తాయి. ఈ గింజలను తింటే శరీరంలోని కొవ్వు వేగంగా తగ్గుతుంది. అంతే కాదు, విటమిన్లు నిండిన ఈ గింజలలో అనేక ఇతర గుణాలు కూడా ఉన్నాయి.

1 / 5
చియా విత్తనాలలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది పేగు ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది. మంచి గట్ జీవక్రియను మెరుగుపరుస్తుంది. ఇది మీ శరీర పనితీరును చక్కగా ఉంచడంలో కూడా సహాయపడుతుంది. చియా గింజల్లో 14 శాతం ప్రొటీన్ ఉంటుంది. అమినో యాసిడ్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది. చియా గింజల రోజువారీ వినియోగం శారీరక విధులకు అవసరైమన ప్రోటీన్‌ను అందిస్తుంది.

2 / 5
నీటిలో నానబెట్టిన చియా విత్తనాలు తీసుకోవడం వల్ల బరువు వేగంగా తగ్గొచ్చు. చాలా సేపు కడుపు నిండుగా ఉంచుతుంది. అతిగా తినే ధోరణి తగ్గుతుంది. చియా విత్తనాలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. తద్వారా గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఇందులో గుండెను ఆరోగ్యంగా ఉంచే ఒక రకమైన కొవ్వు ఆమ్లం ఉంటుంది.

3 / 5
సాధారణంగా తిన్న తర్వాత శరీరంలో చక్కెర స్థాయి పెరుగుతుంది. కానీ చియా విత్తనాలు ఆ చక్కెర స్థాయిలను సాధారణంగా ఉంచడంలో సహాయపడతాయి. కాబట్టి మీకు డయాబెటిస్ సమస్య ఉంటే ఈ విత్తనాలు తప్పకుండా తీసుకోండి.

4 / 5
కాల్షియం, మెగ్నీషియం, ఫాస్పరస్ సమృద్ధిగా ఉన్న చియా గింజలు ఎముకల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కూడా సహాయపడతాయి. పాలు లేదా పాల ఉత్పత్తులను తినలేని వారు ఎముకల సంరక్షణ కోసం చియా విత్తనాలపై ఆధారపడవచ్చు. ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. చియా జీర్ణక్రియకు సహాయపడుతుంది. చియా నానబెట్టిన నీటిని ఉదయాన్నే తాగడం వల్ల మలబద్ధకం సమస్య తగ్గి, జీర్ణశక్తి మెరుగుపడుతుంది.

5 / 5