వేపతో నిగనిగలాడే అందం.. ఇలా ట్రై చేస్తే సరి.. ముఖంలో మెరుపు ఖాయం..!
ఆరోగ్యకరమైన చర్మం కోసం ప్రజలు ఖరీదైన బ్యూటీ ఉత్పత్తులను ఉపయోగిస్తారు. కానీ ఇప్పటికీ వారికి ఆశించిన ప్రయోజనాలు లభించవు. కొన్నిసార్లు, వాటి దుష్ప్రభావాల కారణంగా, మొటిమలు, దద్దుర్లు, చర్మ ఇన్ఫెక్షన్లు కూడా వేధిస్తుంటాయి.. అటువంటి పరిస్థితిలో మీరు ఇంట్లోనే వేప తో ఫేస్ ప్యాక్ తయారు చేసుకుని అప్లై చేసుకోవచ్చు.
Updated on: Sep 16, 2025 | 2:10 PM

వేపాకుతో చర్మాన్ని, జుట్టును సంరక్షించుకోవచ్చు. వేపలో విటమిన్ ఎ, సి, కెరొటినాయిడ్స్, లినోలియిక్, ఒలియిక్ చర్మానికి మేలు చేస్తాయి. ఐదు వేప ఆకులను మెత్తగా నూరి దానిలో కాస్త పెరుగూ, చెంచా నున్వుల నూనె, పెసరపిండి కలపాలి. ఈ వేప పేస్టును ఒంటికి నలుగులా రుద్దాలి. ఇలా తరచూ చేయడం వల్ల మొటిమలు, మచ్చలు తగ్గి చర్మం కోమలంగా మారుతుంది.

వేపాకులో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు ఉన్నాయి. ఇవి చర్మ వ్యాధులను తగ్గించటమే కాకుండా, చర్మ సమస్యలు తలెత్తకుండా చేస్తాయి. వేప ఫేస్‌ప్యాక్ వల్ల చర్మం అందంగా తయారవుతుంది. ముఖంపై మొటిమలు, ముడతలు, నల్లటి మచ్చలు తగ్గుతాయి. వేప ఫేస్‌ప్యాక్‌ను తరుచుగా ఉపయోగిస్తే మొఖం మీద ఉన్న మచ్చలన్ని తొలగిపోతాయి.

జిడ్డు చర్మాన్ని దూరం చేయడానికి వేపాకు బాగా పనిచేస్తుంది. వేపలో యాంటీసెప్టిక్ గుణాలు ఉంటాయి. గాయాలు, ఇన్ఫెక్షన్లను తగ్గించడంతో వేప సమర్థవంతంగా పని చేస్తుంది. వేప ముఖంపై ఉన్న మచ్చలను తగ్గించి ముఖాన్ని అందంగా మెరిసేలా చేస్తుంది. వేప ఫేస్‌ప్యాక్ ముఖంపై ఉన్న మృతకణాలను తొలగిస్తుంది. ముడతలను తొలగిస్తుంది.

ఫేస్ ప్యాక్ కోసం వేపాకుల పేస్ట్‌లో కొంచం పసుపు వేసి కలిపి ముఖానికి అప్లై చేసుకోవాలి. అనంతరం ముఖం కడుక్కోవాలి. ఇలా క్రమం తప్పకుండా అప్లై చేసుకుంటే మొటిమల వల్ల ఏర్పడిన మచ్చలు, గాయాల వల్ల ఏర్పడిన మచ్చలు తొలగుతాయి.

మంచి చర్మం కోసం చాలా మంది ఐస్ క్యూబ్స్ ని పెద్ద మొత్తంలో ఉపయోగిస్తారు. అయితే ఈ ఐస్ క్యూబ్ నిజంగా చర్మానికి ప్రయోజనకరంగా ఉందా? లేదా? అనే విషయం ఇక్కడ తెలుసుకుందాం.




