
కావాల్సిన పదార్థాలు : పావు కిలో మటన్, పెద్ద దోసకాయ, 2 ఉల్లిపాయలు, 4 పచ్చిమిర్చి, 2 టేబుల్ స్పూన్ కారం, ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ , అర టీ స్పూన్ పసుపు, అర టీ స్పూన్ ధనియాల పొడి, అర టీ స్పూన్ గరం మసాలా, నూనె, రుచికి తగినంత ఉప్పు తీసుకోవాలి.

ముందుగా స్టవ్ వెలిగించి చిన్న పాన్ లో కొద్దిగా ఆయిల్ వేసి అది వేడయ్యాక ఉల్లిపాయలుముక్కలు, 4 పచ్చిమిర్చి వేసి గోల్డ్ కలర్ వచ్చే వరకు స్టవ్ మీదనే ఉంచి వేయించండి.

ఇక ఆ తర్వాత ఒక టీ స్పూన్ అల్లం-వెల్లుల్లి పేస్ట్ వేసి, వేయించిన మటన్ ముక్కలను వేయండి. 10 నిమిషాలు తర్వాత పసుపు, ఉప్పు కొంచం నీళ్ళు పోసి బాగా ఉడికించండి.

మటన్ ముక్కలు బాగా ఉడికిన తర్వాత దోసకాయ ముక్కలు వేసి గరిటేతో మిక్స్ అయ్యేలా కలపండి. దీనిని అలాగే, స్టవ్ మీదే 10 నిముషాలు పాటు ఉంచి బాగా ఉడకనివ్వండి.

చివర్లో కారం, ధనియాల పొడి, అర టీ స్పూన్ గరం మసాలా పొడులు వేసి బాగా కలుపుకోండి. పులుసు ఎక్కువ కావాలనుకునే వారు గ్లాస్ మంచి నీళ్ళు పోసి 15 నిముషాలు పాటు పొయ్యి మీదే ఉంచండి. మటన్ ఉడికిన తర్వాత చివర్లో కొత్తిమీరను చల్లి కిందకు దించేయండి. అంతే, వేడి వేడి దోసకాయ మటన్ కర్రీ రెడీ.