వేడి నూనెతో తల మసాజ్ చేయడం వల్ల ఎన్ని లాభాలో తెలుసా..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
జుట్టు సంరక్షణలో భాగంగా రెగ్యులర్ గా హెయిర్ వాష్ చేస్తే సరిపోదు. దానికి పోషణ అవసరం. ఆ పోషణ నూనె నుంచి లభిస్తుంది. ఆ నూనెను వేడి చేసి జుట్టుకు మసాజ్ చేయడం వల్ల మీ జుట్టు అందంగా, ఆరోగ్యంగా మారుతుందని నిపుణులు చెబుతున్నారు. వేడి చేసిన నూనెతో తలకు మసాజ్ చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇక్కడ తెలుసుకుందాం..
Updated on: Aug 04, 2025 | 9:27 PM

వేడి నూనెతో తల మసాజ్ చేయడం వల్ల స్కాల్ప్‌లో రక్తప్రసరణ మెరుగుపడుతుంది. దీంతో జుట్టు బాగా ఎదుగుతుంది. ఒత్తైన జుట్టు పొందవచ్చు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. వేడి నూనెతో తల మసాజ్ చేయడం వల్ల జుట్టు రాలిపోవడం వంటి సమస్యలు ఉండవు.

ముఖ్యంగా జుట్టు చివర్లు చిట్లడం వంటి ఇబ్బందులు రావు. తలకు వేడి నూనెతో మసాజ్ చేయడం వల్ల తలపై పేరుకుపోయిన మురికి, చుండ్రు వంటివి తొలగుతాయి. చుండ్రు ఉన్న వారు వేడి నూనెతో మసాజ్ చేయడం మంచిది.

రెగ్యులర్‌గా వేడి నూనెతో మసాజ్ చేయడం వల్ల జుట్టు మూలాల నుంచి దృఢంగా మారుతుంది. దీంతో ఒత్తైన జుట్టు పొందవచ్చు. తలకు వేడి నూనెను అప్లై చేయడం వల్ల జుట్టు సిల్కీగా ఉంటుంది. దీంతో జుట్టును నచ్చినట్లుగా స్టైల్ చేసుకోవచ్చు.

వేడి నూనెతో తల మసాజ్ చేయడం వల్ల జుట్టు డ్రై అవదు. స్కాల్ప్ తేమతో ఉంటుంది. దీంతో పొడి జుట్టు సమస్య రాదు. వేడి నూనె సహజమైన మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది. కనుక రెగ్యులర్‌గా అప్లై చేయడం వల్ల స్కాల్ప్ ఆరోగ్యంగా మారుతుంది.

తలకు వేడి నూనెను అప్లై చేయడం వల్ల జుట్టు సిల్కీగా ఉంటుంది. దీంతో జుట్టును నచ్చినట్లుగా స్టైల్ చేసుకోవచ్చు. కొబ్బరి, బాదం, ఆవాల నూనె వంటి వాటిల్లో విటమిన్స్, ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి జుట్టుకు పోషణ ఇస్తాయి. వీలైతే, మీరు ప్రతిరోజూ మీ జుట్టును ఆముదం లేదా కొబ్బరి నూనెతో వేడి చేసి మీ తలకు మసాజ్ చేయాలి.




