చాలామంది ముఖం, జుట్టును చూసుకున్నంత జాగ్రత్తగా శరీరంలోని చేతులు, కాళ్లు, వీపు గురించి అంతగా పట్టించుకోరు. ఫలితంగా శరీరంపై మొటిమలు, నల్లమచ్చలు ఏర్పడుతాయి. శరీరం మొత్తం గురించి తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే చర్మం నల్లగా మారి అందవిహీణంగా కనిపిస్తుది. దీంతోపాటు అనేక ఇతర సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. కాబట్టి ముఖం, జుట్టుతోపాటు శరీరంలోని ఇతర భాగాలకు కూడా సమానమైన శ్రద్ధ అవసరం.