- Telugu News Photo Gallery Home Remedies For Cracked Heels: How to take care of cracked heels please check
Beauty Tips: పగిలిన మడమలతో ఇబ్బంది పడుతున్నారా.. ! ఇంట్లోనే ఈ సింపుల్ చిట్కాలు పాటించి చూడండి..
వేడి వాతావరణంలో ఎక్కువ చెమట పట్టడం వల్ల శరీరంలోని నీరు చాలా వరకు పోతుంది. అంతేకాదు మారిన కాలంతో పాటు వచ్చిన మార్పుల్లో భాగంగా డీహైడ్రేషన్ సమస్య కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఉష్ణోగ్రతలు పెరిగే కొద్దీ కాలుష్యం కూడా పెరుగుతుంది. దుమ్ము-ధూళి, కాలుష్యం ప్రభావం వల్ల చీలమండ పగుళ్ల సమస్య ఎక్కువ అవుతుంది. ఈ సమస్య నుంచి బయటపడేందుకు కొన్ని ఇంటి చిట్కాలు ఉన్నాయి. అవి ఏమిటో తెలుసుకుందాం.
Updated on: Aug 20, 2023 | 12:13 PM

చలికాలమైనా, వేడి ఎక్కువ అయిన పాదాల పగుళ్ల సమస్య ఏర్పడతాయి. కొందరికి పదాల పగుళ్ల సమస్య ఏడాది పొడవునా ఉంటుంది. వేసవి లో మాత్రమే కాదు.. ఏ కాలమైనా చాలా మంది పాదాల పగుళ్లతో బాధపడుతుంటారు. శరీరంలో తగినంత నీరు లేకపోవడం దీనికి ఒక కారణం.

రోజ్ వాటర్‌లో యాంటీ ఆక్సిడెంట్ ,యు యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. ఇవి సెల్ డ్యామేజ్‌ని నివారిస్తాయి. చర్మం పొడిబారడాన్ని తగ్గిస్తాయి. గ్లిజరిన్ చర్మాన్ని తేమగా ఉంచుతుంది. పగిలిన మడమలను మాయిశ్చరైజ్ చేయడానికి సహాయపడుతుంది. చీలమండల పగుళ్ల సమస్యలో ఇవి బెస్ట్ రెమిడీస్.

ఒక టేబుల్ స్పూన్ ఉప్పు, రెండు టేబుల్ స్పూన్ల గ్లిజరిన్, రెండు టీస్పూన్ల రోజ్ వాటర్, అరకప్పు వేడినీరు తీసుకోవాలి. ఇప్పుడు ఈ పదార్థాలను నీటిలో కలపండి. ఈ నీటిలో పాదాలను 15-20 నిమిషాలు నానబెట్టండి. తర్వాత ప్యూమిస్ స్టోన్‌తో చీలమండలు, పాదాల అంచులను స్క్రబ్ చేయండి.

మీరు పెట్రోలియం జెల్లీని కూడా ఉపయోగించవచ్చు. ఈ రకమైన జెల్లీ పగిలిన మడమలకు తేమను పునరుద్ధరించడానికి సహాయపడుతుంది.

తేనె సహజసిద్ధమైన క్రిమినాశకమని చెబుతారు. ఇది చీలమండల పగుళ్లను నయం చేస్తుంది. గోరువెచ్చని నీటిలో తేనె మిక్స్ చేసి అందులో మీ పాదాలను నానబెట్టండి. మీరు ఫలితాలు పొందుతారు.




