- Telugu News Photo Gallery Cricket photos Ipl 2024 Sri Lanka Star bowler lasith malinga return mumbai indians bowling coach
IPL 2024: ముంబై జట్టులోకి తిరిగొచ్చిన స్టార్ బౌలర్.. ఈసారి ట్రోఫీ మాదే అంటోన్న ఫ్యాన్స్..
Lasith Malinga, IPL 2024: ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌కు మాత్రమే ఆడిన అతికొద్ది మంది ఆటగాళ్లలో శ్రీలంకకు చెందిన లసిత్ మలింగ ఒకరు. 2009 నుంచి 2021 వరకు మలింగ మొత్తం 139 మ్యాచ్‌ల్లో 195 వికెట్లు తీశాడు. ముంబై ఇండియన్స్ జట్టు 5 సార్లు ఛాంపియన్‌గా నిలవడం విశేషం. రిటైర్మెంట్ తర్వాత మలింగ రాజస్థాన్ రాయల్స్ జట్టుకు చెందిన శ్రీలంక కోచ్ కుమార సంగక్కర ఒత్తిడితో RR జట్టుకు బౌలింగ్ కోచ్ అయ్యాడు.
Updated on: Aug 20, 2023 | 9:30 AM

ముంబై ఇండియన్స్‌లో అత్యంత విజయవంతమైన బౌలర్ లసిత్ మలింగ తన పాత జట్టులోకి తిరిగి వచ్చాడు. కానీ ఈసారి బౌలర్‌గా మాత్రం కాదండోయ్.. ఏకంగా కోచ్ అవతారం ఎత్తాడు.

2021లో ఐపీఎల్‌కు వీడ్కోలు పలికిన లసిత్ మలింగ ఆ తర్వాత రాజస్థాన్ రాయల్స్ బౌలింగ్ కోచ్‌గా కనిపించాడు. ఇప్పుడు యార్కర్ స్పెషలిస్ట్ బౌలర్‌ను తిరిగి ముంబై ఇండియన్స్ జట్టులోకి తీసుకురావడంలో ఫ్రాంచైజీ విజయం సాధించింది.

ఐపీఎల్ 2024లో ముంబై ఇండియన్స్ జట్టుకు ఫాస్ట్ బౌలింగ్ కోచ్‌గా లసిత్ మలింగ పనిచేయనున్నాడు. అలాగే, అంతకుముందు, న్యూజిలాండ్‌కు చెందిన షేన్ బాండ్‌ను ముంబై ఫ్రాంచైజీ బౌలింగ్ కోచ్‌గా పనిచేశాడు.

ముంబై ఇండియన్స్‌లో అత్యంత విజయవంతమైన బౌలర్ లసిత్ మలింగ తన పాత జట్టులోకి తిరిగి వచ్చాడు. కానీ, ఈసారి బౌలర్‌గా కాకుండా, కోచ్‌గా రీఎంట్రీ ఇచ్చాడు.

ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌కు మాత్రమే ఆడిన అతికొద్ది మంది ఆటగాళ్లలో శ్రీలంకకు చెందిన లసిత్ మలింగ ఒకరు. 2009 నుంచి 2021 వరకు మొత్తం 139 మ్యాచ్‌లు ఆడిన మలింగ 195 వికెట్లు పడగొట్టాడు. ముంబై ఇండియన్స్ జట్టు 5 సార్లు ఛాంపియన్‌గా నిలవడం విశేషం.

కానీ, రిటైర్మెంట్ తర్వాత మలింగ రాజస్థాన్ రాయల్స్ జట్టుకు చెందిన శ్రీలంక కోచ్ కుమార సంగక్కర ఒత్తిడితో RR జట్టుకు బౌలింగ్ కోచ్ అయ్యాడు. కాంట్రాక్ట్ గడువు ముగియడంతో ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ మాజీ ఆటగాడిని తిరిగి తన ఖాతాలో వేసుకోగలిగింది.




