Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Herbal Tea: సీజనల్ వ్యాధుల నుంచి రక్షణ కోసం.. మిల్క్ టీ బదులు.. ఈ నాలుగు హెర్బల్ టీలు బెస్ట్ ఎంపిక..

Herbal Tea: చల్లని వాతావరణంలో వేడి వేడిగా టీతాగడాన్ని ఎక్కువమంది ఇష్టపడతారు. అయితే మిల్క్ టీ ఎక్కువగా తాగడం వల్ల పొట్టలో గ్యాస్ సమస్యలు వస్తాయి. అందువల్ల, సీజనల్ వ్యాధులను నివారించడానికి హెర్బల్ టీ తాగవచ్చు. వర్షాకాలంలో తరచుగా వచ్చే జలుబు, దగ్గు నుండి మిమ్మల్ని హెర్బల్ టీలు రక్షిస్తాయి. ఈరోజు కొన్ని రకాల హెర్బల్ టీల గురించి తెలుసుకుందాం

Surya Kala

|

Updated on: Aug 11, 2022 | 11:54 AM

వర్షాకాలం అనేక వ్యాధులను తెస్తుంది. ఈ సీజన్‌లో జలుబు, ఫ్లూ, దగ్గు సర్వసాధారణం. అటువంటి పరిస్థితిలో, ఈ సీజనల్ వ్యాధులను నివారించడానికి, మీరు అనేక రకాల హెర్బల్ టీని కూడా త్రాగవచ్చు. మీరు ఏ టీ తాగవచ్చో తెలుసుకుందాం.

1 / 5
తులసి టీ - హిందూ మతంలో తులసికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. తులసిని పూజిస్తారు. తులసి ఆకుల్లో ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. తులసి మిమ్మల్ని అనేక సమస్యల నుండి రక్షిస్తుంది. వర్షాకాలంలో తులసి టీ తాగవచ్చు. ఇది తలనొప్పి, జలుబు, దగ్గు నుండి ఉపశమనం ఇస్తుంది.

2 / 5
అల్లం టీ - మీరు వర్షాకాలంలో అల్లం టీ తాగవచ్చు. ఇది జలుబు, దగ్గు, ఫ్లూ నుండి రక్షణ ఇస్తుంది. అంతేకాదు ఈ టీ రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. రక్త ప్రసరణను కూడా మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

3 / 5
చామంతి టీ - రాత్రిపూట నిద్రలేమి సమస్య ఉన్నవారికి చామంతి టీ మంచి సహాయకారి. సీజనల్ వ్యాధ్యులైన వైరల్ ఫీవర్, జలుబు, ఫ్లూ , ఇన్ఫెక్షన్లను నివారించడానికి ఈ టీని తాగవచ్చు. ఈ టీలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి.

4 / 5
గ్రీన్ టీ - బరువు తగ్గడానికి గ్రీన్ టీని ఎక్కువగా తీసుకుంటారు. గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉన్నాయి. ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో, అంటు వ్యాధుల నుండి రక్షించడంలో సహాయపడుతుంది. అంతేకాదు గులను ఆరోగ్యంగా ఉంచుతుంది.

5 / 5
Follow us