Health: గుండె ఆరోగ్యాన్ని కాపాడుకుంటే, ఆ ప్రయోజనం కూడా.. పరిశోధనల్లో ఆసక్తికర విషయాలు

|

Aug 09, 2024 | 9:55 PM

ప్రస్తుతం గుండె సంబంధిత సమస్యల బారిన పడుతోన్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఒకప్పుడు వయసు మళ్లిన వారిలో మాత్రమే గుండె సమస్యలు వచ్చేవి. కానీ ప్రస్తుతం పాతికేళ్లు కూడా నిండని వారిలో కూడా గుండె సంబంధిత సమస్యలు వస్తున్నాయి. అయితే గుండె ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు చేసే ప్రయత్నాలు, మరో ఫలితాన్ని ఇస్తాయని నిపుణులు చెబుతున్నారు..

1 / 5
మనిషి ఆరోగ్యంగా ఉండడంలో గుండెది కీలక పాత్ర అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గుండె ఆరోగ్యంగా ఉండాలంటే జీవనశైలిలో మార్పులు, తీసుకునే ఆహారంలో మార్పులు చేసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. అయితే గుండె ఆరోగ్యం కోసం ప్రయత్నాలు మరో ఫలితాన్ని ఇస్తాయని నిపుణులు చెబుతున్నారు.

2 / 5
శారీరక వయసు అనేది జన్యువుల మీద ఆధారపడి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే ఇది జీవన విధానం, మానసిక ఒత్తిడి సైతం వయసు పెరుగుదలపై ప్రభావం చూపుతుందని పలు పరిశోధనల్లో వెల్లడైంది.

3 / 5
పరిశోధకులు శారీరక వయసును అంచనా వేయటానికి జన్యు వ్యక్తీకరణను నియంత్రించే డీఎన్‌ఏ మెథీలేషన్‌ ప్రక్రియను ఉపయోగిస్తుంటారు. గుండె ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు జీవన విధానంలో చేసిన మార్పులు వయసు తగ్గడానికి కారణమవుతుందని నిపుణులు అంటున్నారు.

4 / 5
పరిశోధనల్లో భాగంగా 5682 మందిని పరిగణలోకి తీసుకున్నారు. ఆహారం, శారీరక శ్రమ, నిద్ర, పొగ తాగే అలవాటు, రక్తపోటు, శరీర ఎత్తు బరువు నిష్పత్తి, రక్తంలో కొలెస్ట్రాల్, గ్లూకోజు మోతాదుల ఆధారంగా గుండె ఆరోగ్యాన్ని నిర్ణయించారు.

5 / 5
గుండె ఆరోగ్యానికి ఉపయోగపడే అలవాటు.. వయసు పెరిగే ప్రక్రియను వెనక్కి తిప్పినట్లు, ఫలితంగా శారీరక వయసూ వెనక్కి మళ్లుతున్నట్టు అధ్యయన ఫలితాలు సూచిస్తున్నాయి.