- Telugu News Photo Gallery Health Side effects of Using Plastic Straws, check here is details in Telugu
Plastic Straws Effects: ప్లాస్టిక్ స్ట్రాలు ఉపయోగిస్తున్నారా.. ఈ సమస్యలు వస్తాయి జాగ్రత్త!
మనం ఎక్కువగా ఉపయోగించే వస్తువుల్లో స్ట్రాలు కూడా ఒకటి. స్ట్రాల గురించి స్పెషల్‌గా పరిచయం అవసరం లేదు. అందరికీ వీటి గురించి తెలుసు. జ్యూసులు తాగాలన్నా, కొబ్బరి నీళ్లు, కూల్ డ్రింక్స్ ఇలా ఏం తాగాలన్నా.. ఇప్పుడు స్ట్రాలనే ఉపయోగిస్తున్నారు. కానీ ఈ స్ట్రాల ఉపయోగం వల్ల అనేక సమస్యలు పొంచి ఉన్నాయన్న విషయం మీకు తెలుసా? అంతే కాకుండా ఆహారం కూడా కలుషితం అయ్యే అవకాశాలు ఉన్నాయని నిపుణులు..
Updated on: Apr 02, 2024 | 4:43 PM

మనం ఎక్కువగా ఉపయోగించే వస్తువుల్లో స్ట్రాలు కూడా ఒకటి. స్ట్రాల గురించి స్పెషల్‌గా పరిచయం అవసరం లేదు. అందరికీ వీటి గురించి తెలుసు. జ్యూసులు తాగాలన్నా, కొబ్బరి నీళ్లు, కూల్ డ్రింక్స్ ఇలా ఏం తాగాలన్నా.. ఇప్పుడు స్ట్రాలనే ఉపయోగిస్తున్నారు.

కానీ ఈ స్ట్రాల ఉపయోగం వల్ల అనేక సమస్యలు పొంచి ఉన్నాయన్న విషయం మీకు తెలుసా? అంతే కాకుండా ఆహారం కూడా కలుషితం అయ్యే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.

ప్లాస్టిక్ భూమిలో త్వరగా కలసి పోదు. ఎప్పటికో కలిసినా.. విషపూరితంగా మారుతుంది. స్ట్రాలను అనేక రసాయనాలు వాడి ఉపయోగిస్తారు. కాబట్టి వీటిని ఉపయోగించకపోవడమే మంచిది.

ఈ ప్లాస్టిక్ స్ట్రాలను ఎక్కువగా వాడితే.. ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. వీటి వల్ల నోటిలో గాయాలు, పుండ్లు, కంటి గాయాలు, శ్వాస ఇతర సమస్యలు వస్తాయి. అంతే కాకుండా వీటితో తాగడం వల్ల ఆహారం కలుషితం కూడా కావచ్చు.

సాధ్యమైనంత వరకు ప్లాస్టిక్ స్ట్రాలను ఉపయోగించకుండా ఉండటమే.. ఆరోగ్యానికి, పర్యావరణానికి మేలని నిపుణులు సూచిస్తున్నారు. ప్లాస్టిక్ స్ట్రాలకు బదులు.. స్టెయిన్ లెస్ స్టీల్, మెటల్, పేపర్ స్ట్రాలను ఎంచుకోవాలని చెబుతున్నారు.




