- Telugu News Photo Gallery Cricket photos England Ben Stokes reveals he won't be in playing in T20 world cup in June so as to prolong his career
T20 World Cup: షాకింగ్ న్యూస్.. భారత్‌లో టెస్ట్ సిరీస్ ఓటమి ఎఫెక్ట్.. టీ20 ప్రపంచకప్ నుంచి ఇంగ్లండ్ స్టార్ ప్లేయర్ ఔట్..
Ben Stokes Out Of T20I World Cup: కాగా, ఈ నిర్ణయం తన ధీర్ఘకాలిక కెరీర్‌కు పునాది అవుతుందంటూ తనకు తాను భరోసా కలిగిస్తుందని, దీంతో త్వరలోనే తన ఆల్ రౌండర్ ఆటతో తిరిగి వాస్తానంటూ చెప్పుకొచ్చాడు. ఈ మేరకు "ఐపీఎల్, ప్రపంచ కప్ నుంచి వైదొలగడం అనేది నేను భవిష్యత్ కోసం ఆల్ రౌండర్‌గా ఉండాలనుకుంటున్నాను" అంటూ ప్రకటించాడు.
Updated on: Apr 02, 2024 | 3:39 PM

Ben Stokes Out Of T20I World Cup: ఇంగ్లండ్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ జూన్, జులై నెలల్లో జరిగే టీ20 ప్రపంచకప్ నుంచి వైదొలిగాడు. తన నిర్ణయంపై స్టోక్స్ మాట్లాడుతూ “నేను కష్టపడి పని చేస్తున్నాను. క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్‌లలో ఆల్‌రౌండర్‌గా పూర్తి పాత్రను నిర్వహించడానికి నా బౌలింగ్ ఫిట్‌నెస్‌ను తిరిగి పెంచుకోవడంపై దృష్టి పెడుతున్నాను' అంటూ చెప్పుకొచ్చాడు.

కాగా, ఈ నిర్ణయం తన ధీర్ఘకాలిక కెరీర్‌కు పునాది అవుతుందంటూ తనకు తాను భరోసా కలిగిస్తుందని, దీంతో త్వరలోనే తన ఆల్ రౌండర్ ఆటతో తిరిగి వాస్తానంటూ చెప్పుకొచ్చాడు. ఈ మేరకు "ఐపీఎల్, ప్రపంచ కప్ నుంచి వైదొలగడం అనేది నేను భవిష్యత్ కోసం ఆల్ రౌండర్‌గా ఉండాలనుకుంటున్నాను" అంటూ ప్రకటించాడు.

“నా మోకాలి శస్త్రచికిత్స తర్వాత, తొమ్మిది నెలలు బౌలింగ్ చేయకుండా బౌలింగ్ కోణంలో నేను ఎంత వెనుకబడి ఉన్నానో ఇటీవలి భారత టెస్టు పర్యటన హైలైట్ చేసింది. మా టెస్ట్ సమ్మర్ ప్రారంభానికి ముందు కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో డర్హామ్ తరపున ఆడేందుకు నేను ఎదురు చూస్తున్నాను" అంటూ తెలిపాడు.

"మా టైటిల్‌ను కాపాడుకోవడంలో జోస్, మోటీ, ఇంగ్లండ్ టీమ్ సభ్యులందరికీ శుభాకాంక్షలు" అంటూ తన టీమేంట్స్‌కు సూచించాడు. కాగా, ఈ ఆల్ రౌండర్ లోటుతో ఇంగ్లండ్ జట్టుకు భారీ నష్టం జరిగే అవకాశం ఉంది. టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్ జట్టు ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగే అవవాశం ఉంది.

ICC పురుషుల T20 ప్రపంచ కప్ 2024లో తొలి మ్యాచ్ జూన్ 4న బార్బడోస్‌లోని కెన్సింగ్టన్ ఓవల్‌లో స్కాట్లాండ్‌తో ప్రారంభమవుతుంది. కాగా, ఇంగ్లండ్ జట్టు సూపర్ 8, నాకౌట్‌లకు అర్హత సాధించడానికి ముందు బార్బడోస్, ఆంటిగ్వా, ఒమన్, నమీబియాతో గ్రూప్ మ్యాచ్‌లను ఆడుతుంది.




