Virat Kohli Records: కోహ్లీ ఖాతాలో మరో మైలురాయి.. ఐపీఎల్ చరిత్రలోనే 2వ ప్లేయర్‌గా రికార్డ్..
IPL 2024: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2024) 15వ మ్యాచ్‌లో RCBతో లక్నో సూపర్‌జెయింట్ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్ 181 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని ఛేదించిన ఆర్సీబీ జట్టు 19.4 ఓవర్లలో 153 పరుగులకు ఆలౌటైంది. దీంతో ఎల్‌ఎస్‌జీ జట్టు 28 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ లక్ష్యాన్ని ఛేదించేందుకు ఓపెనర్‌గా వచ్చిన విరాట్ కోహ్లీ 16 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌తో 22 పరుగులు చేసి ఔటయ్యాడు.