AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చలికాలంలో ఆరోగ్య సమస్యలు.. డైట్ లో ఖర్జూరాలను చేర్చుకుంటే సూపర్ బెనెఫిట్స్..

ప్రస్తుతం చలి పంజా విసురుతోంది. రోజురోజుకీ ఉష్ణోగ్రతలు తగ్గిపోతున్నాయి. చలికాలం వస్తూ వస్తూనే పలు వ్యాధులను వెంట తెస్తుంది. అయితే ఈ కాలంలో తీసుకునే ఆహారంలో పలు మార్పులు చేసుకోవడం వల్ల ఇలాంటి సీజనల్‌ వ్యాధులకు చెక్‌ పెట్టొచ్చు. ఇలాంటి బెస్ట్‌ ఫుడ్స్‌లో ఖర్జూర ఒకటి....

Ganesh Mudavath
|

Updated on: Dec 26, 2022 | 10:28 AM

Share
ఖర్జూరలో ఉండే ఎన్నో పోషకాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఖర్జూరంలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది, ఇది జీర్ణవ్యవస్థను బాగు చేయడంలో ఉపయోగపడుతుంది. జీర్ణక్రియ బాగా ఉంటే, మలబద్ధకం సమస్య ఉండదు దీనివల్ల ఆరోగ్యం మెరగవుతుంది.

1 / 5
Dates

Dates

2 / 5
ఖర్జూరంలోని మెగ్నీషియం రక్తపోటును నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది. ఖర్జూరంలో ఉండే పొటాషియం అధిక రక్తపోటును తగ్గిస్తుంది. అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్ పరిశోధన ప్రకారం, ఒక వ్యక్తి రోజుకు 100 మిల్లీగ్రాముల మెగ్నీషియం తీసుకుంటే, గుండెపోటు ప్రమాదాన్ని 9 శాతం తగ్గించవచ్చని తేలింది.

3 / 5
ఖర్జూరంలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. రక్తహీనత సమస్యతో బాధపడేవారికి ఖర్జూరం దివ్యౌషధం అని చెప్పొచ్చు. ఖర్జూరాన్ని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల శరీరంలో ఐరన్ లోపం నుంచి బయటపడొచ్చు. ఖర్జూరంలో నాడీ వ్యవస్థకు అవసరమైన అన్ని విటమిన్లు ఉంటాయి. ఈ విటమిన్లు నాడీ వ్యవస్థ యొక్క పనితీరును నిర్వహిస్తాయి.

4 / 5
ఖర్జూరం గర్భిణీలకు ఎంతో మేలు చేస్తుంది. ఇందులోని ఐరన్‌ తల్లీబిడ్డలిద్దరికీ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఖర్జూరంలోని పోషకాలు గర్భాశయ కండరాలను బలోపేతం చేయడానికి కూడా పని చేస్తాయి. ఖర్జూరం తల్లి పాలకు అవసరమైన పోషకాలను కూడా అందిస్తుంది. దీనితో పాటు, బిడ్డ ప్రసవించిన తర్వాత సంభవించే రక్తస్రావం కూడా భర్తీ చేస్తుంది.

5 / 5