- Telugu News Photo Gallery Technology photos Redmi Launching 3 new smartphones from 12 series in next month. Have a look on features and price Telugu Tech News
Redmi: భారత్‌లో లాంచ్‌కి సిద్ధమైన రెడ్‌మీ నోట్ 12 సిరీస్.. 200 మెగాపిక్సెల్స్ కెమెరాతో పాటు మరెన్నో అద్భుత ఫీచర్లు..
చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం రెడ్‌మీ భారత్‌లో 12 సిరీస్‌ను లాంచ్ చేస్తోంది. ఇందులో భాగంగా మొత్తం మూడు స్మార్ట్ ఫోన్‌లను తీసుకురానుంది. జనవరి 5న లాంచ్ కానున్న ఈ ఫోన్లలో అత్యాధునిక ఫీచర్లను అందిస్తున్నారు..
Updated on: Dec 26, 2022 | 12:21 PM

చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ దిగ్గజం రెడ్‌మీ భారత్‌లో 12 సిరీస్‌ను లాంచ్ చేయనుంది. ఈ సిరీస్‌లో భాగంగా రెడ్‌మీ నోట్ 12, నోట్ 12 ప్రో, నోట్ 12 ప్రో+ మూడు ఫోన్‌లను తీసుకొస్తున్నారు.

న్యూ ఇయర్ గిఫ్ట్‌గా రెడ్‌మీ ఈ ఫోన్‌లను మార్కెట్లోకి తీసుకొస్తోంది. జనవరి 5వ తేదీన రెడ్‌మీ నోట్ 12 సిరీస్‌ను లాంచ్ చేయనుంది. రెడ్‌మీ నోట్ 12 ప్రో ప్లస్‌లో ఏకంగా 200 మెగాపిక్సెల్స్‌తో కూడిన కెమెరాను అందిస్తుండడం విశేషం.

రెడ్‌మీ నోట్ 12 ప్రో+ ఫోన్ ధర లీకైంది. ఈ సమాచారం ప్రకారం 6జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ ఫోన్ ధర రూ. 24,999 కాగా, 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ ధర రూ. 26,999, 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ ఫోన్ ధర రూ. 28,999గా ఉంది.

ఇక ఈ సిరీస్‌లో వస్తోన్న ఫోన్‌లలో మీడియాటెక్ డైమెన్సిటీ 1080 ఎస్‌ఓసీ ప్రాసెసర్‌ను అందించారు. ప్రో+లో సెల్ఫీల కోసం 16 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను అందించారు.

ఈ మూడు స్మార్ట్స్ ఫోన్స్‌లో 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5000 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీని అందించారు. ఒక్క 12 ప్రో+ మాత్రం 210 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ కేవలం 9 నిమిషాల్లోనే 100 శాతం ఛార్జ్ పూర్తవుతుంది.




