Gold Benefits: బంగారు ఆభరణాలతో అందమే కాదు ఆరోగ్యం కూడా.. ఆనారోగ్య సమస్యల ఉంచి ఉపశమనం..
ఆయుర్వేదంలో బంగారానికి విశేషమైన ప్రధాన్యత ఉంది. బంగారంను స్వర్ణ భస్మం రూపంలో ఉపయోగిస్తారు. నేరుగా బంగారు ఆభరణాలను ధరించడం కూడా ఆరోగ్యానికి మేలు చేస్తాయని మనలో చాలా మందికి తెలియదు. మనం బంగారు ఆభరణాలను విలాసం, సాంప్రదాయంలో భాగంగా ధరిస్తుంటాం. ఎందుకంటే ఇది శరీరానికి అనేక ఔషధ ప్రయోజనాలను అందిస్తుంది. బంగారంలో అనేక ఔషధ గుణాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. ఇది చాలా అధ్యయనాల్లో వెల్లడైంది. పూర్వ కాలంలో రాజులు, చక్రవర్తులు,రాణులు బంగారు ఆభరణాలను ధరించేవారు.