Oil Less Chicken: ఆయిల్ లెస్ చికెన్ ఎప్పుడైన తిన్నారా.? ఎలా తయారు చేసుకోవాలంటే.?
చాలా మంది రాత్రిపూట రుచికరమైన భోజనం తినాలనుకుంటారు.వారికోసమే ఆరోగ్యంతో రుచి ఉన్న ఆయిల్ లెస్ చికెన్ మసాలా రెసిపీ. ఈ వంటకం జీరో ఆయిల్‌తో తయారు చేస్తారు కాబట్టి రాత్రి సమయంలో ఆరోగ్యకరమైన భోజనమని నిపుణులు పేర్కొంటున్నారు. కాబట్టి ఆయిల్ లెస్ చికెన్ మసాలాను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
Updated on: Jun 09, 2025 | 9:30 PM

ప్రస్తుత రోజుల్లో వయస్సుతో సంబంధం లేకుండా అందరిని వేధిస్తున్న సమస్య ఊబకాయం. బరువు తగ్గడానికి ఏ రకమైన ఆహారం తినాలో అన్నది సవాలుగా మారుతుంది. ముఖ్యంగా రాత్రి సమయంలో ఏం తినాలో తెలియక తికమకపడుతూ ఉంటారు. చాలా మంది రాత్రిపూట రుచికరమైన భోజనం తినాలనుకుంటారు.

వారికోసమే ఆరోగ్యంతో రుచి ఉన్న ఆయిల్ లెస్ చికెన్ మసాలా రెసిపీ. ఈ వంటకం జీరో ఆయిల్‌తో తయారు చేస్తారు కాబట్టి రాత్రి సమయంలో ఆరోగ్యకరమైన భోజనమని నిపుణులు పేర్కొంటున్నారు. కాబట్టి ఆయిల్ లెస్ చికెన్ మసాలాను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ఆయిల్ లెస్ చికెన్ మసాలా చేయాలంటే చికెన్‌ను బాగా నానబెట్టి నిమ్మ రసం, ఉల్లిపాయలు, పెరుగు మిశ్రమంతో బాగా మేరినేట్ చేయాలి. ఈ ఆయిల్ లెస్ చికెన్‌ను తయారీ కోసం తాజా మసాలాలను ఉపయోగించాలి. వంట చేసేటప్పుడు చికెన్ ఉడకబెట్టడానికి తగినంత సమయం ఇవ్వాలి.

ఈ వంటకం కోసం ఒక గిన్నెలో చికెన్ తీసుకొని అందులో నిమ్మరసం, ఉల్లిపాయలతో మెరినేట్ చేసి ఒక గంట నానబెట్టాలి. ఇలా చేసిన తర్వాత పెరుగులో మీకు నచ్చిన కొన్ని మసాలాలు కలపి నానబెట్టిన చికెన్‌తో కలపాలి.

ఇప్పుడు ఒక నాన్-స్టిక్ పాన్ తీసుకుని చికెన్ ముక్కలపై మందపాటి మసాలా పూత వచ్చే వరకు ఉడికించాలి. రుచి కోసం ఉప్పు, తాజా కొత్తిమీర ఆకులతో అలంకరించాలి. అంతే టేస్టీటేస్టీ ఆయిల్ లెస్ చికెన్ మసాలా రెడీ.



















